ఎన్టీఆర్ డ్యాన్స్, డైలాగ్ డెలివరీకి నేను పెద్ద ఫ్యాన్.. వెంకటేశ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
సంక్రాంతి పండుగ( Sankranti Festival ) కానుకగా విడుదల కానున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఐశ్వర్య రాజేష్( Aishwarya Rajesh ) ఒక హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఐశ్వర్య రాజేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తనకు ఎంతో అభిమానమని ఐశ్వర్య అన్నారు.ఎన్టీఆర్ తో నటించే ఛాన్స్ వస్తే ఎంతో సంతోషిస్తానని ఐశ్వర్య రాజేశ్ వెల్లడించారు.
సంక్రాంతికి వస్తున్నాం మూవీతో కచ్చితంగా సక్సెస్ సాధిస్తానని కాన్ఫిడెన్స్ తో ఉన్న ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ స్టూడెంట్ నంబర్ 1 సినిమా ( Student Number 1 Movie )నుంచి జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూస్తున్నానని తారక్ డ్యాన్స్ కు డైలాగ్ డెలీవరీకీ పెద్ద ఫ్యాన్ అని ఆమె చెప్పుకొచ్చారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఐశ్వర్య రాజేష్ చేసిన కామెంట్లను సోషల్ మీడియ వేదికగా షేర్ చేస్తుండగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
"""/" /
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్2 సినిమాతో( War2 Movie ) బిజీగా ఉన్నారు.
ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో ఐశ్వర్య రాజేష్ కు ఛాన్స్ ఇస్తారేమో చూడాల్సి ఉంది.
మరోవైపు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్ కొత్తగా ఉన్నాయనే సంగతి తెలిసిందే.అనిల్ రావిపూడి ఈ సినిమాతో మరో సక్సెస్ ను అందుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
"""/" /
సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా మెజారిటీ థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది.
వెంకటేశ్ రేంజ్ ను ఈ సినిమా పెంచడం పక్కా అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది.ఐశ్వర్య రాజేష్ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
జాన్వీతో ఎప్పటికీ సినిమా చేయనని చెప్పిన ప్రముఖ స్టార్ డైరెక్టర్.. ఏం జరిగిందంటే?