ఇండో అమెరికన్ చిత్రానికి సై అన్న ఐశ్వర్యారాయ్.. కథ ఎలా ఉండనుందంటే?
TeluguStop.com
బాలీవుడ్ బ్యూటీ, ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె ఎన్నో సినిమాలలో నటించి బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకుంది.
ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తోంది.ఒకవైపు సినిమాలలో నటిస్తూనే, మరొకవైపు పలు వాణిజ్య ప్రకటనల్లో కూడా నటించింది.
అంతేకాకుండా కొన్ని కొన్ని సందర్భాలలో నువ్వు ఏమన్న ఐశ్వర్యరాయ్ అనుకుంటున్నావా అంటూ ఈమె పేరు వాడుతూ ఉంటారు.
ప్రపంచంలోనే అత్యంత అందమైన వారిలో ఒకరిగా ఐశ్వర్యను పేర్కొంటూ ఉంటారు.ఇదిలా ఉంటే ఐశ్వర్యారాయ్ ఇటీవలే మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న పొన్నియిన్ సెల్వన్ సినిమా ఫస్ట్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.
తాజాగా ఈ భామ ఇండో-అమెరికన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.నోబెల్ అవార్డు గ్రహీత అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ పుస్తకం త్రీ ఉమెన్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది.
ఈ సినిమాకు రైటర్-డైరెక్టర్ ఇషితా గంగూలీ దర్శకత్వం వహించనున్నారు.అయితే ఈ సినిమాని మొదట హిందీలో రూపొందించాలి అనుకున్నప్పటికీ.
ఠాగూర్ కోడలు అయిన కాదంబరి దేవి ఉత్తరం చుట్టూ ఈ సినిమా తిరుగుతూ ఉండటం, అదేవిధంగా కథలోని ప్రతి సీన్ అర్బన్ అమెరికన్ సెన్సిబిలిటీస్ తో ముడిపడి ఉండటంతో ఈ సినిమాను ఇంగ్లీషులో తీస్తే బాగుంటుందని స్వయంగా ఐశ్వర్య రాయ్ తెలిపిందని దర్శకురాలు ఇషితా గంగూలీ ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.
ఐశ్వర్యరాయ్ ఈ సినిమా స్క్రిప్ట్ చదివిన తర్వాత చాలా ఎగ్జైట్ అయ్యిందని, దర్శకురాలు గంగూలీ ఐశ్వర్యతో సినిమా చేయడం సంతోషంగా ఉంది అని తెలిపింది.
రాత్రి కిచెన్‌లో సింహం.. భయానక దృశ్యం లైవ్ కెమెరాలో రికార్డ్.. గుండెలు అదిరే వీడియో చూడండి!