వారిలో బెటర్ హాఫ్ ఎవరో చెప్పడం కష్టం.. ఐశ్వర్యారాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్!
TeluguStop.com
మాజీ ప్రపంచ సుందరి నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ చాలా రోజుల తర్వాత ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్-1 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 30వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇకపోతే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాదులో ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఐశ్వర్యరాయ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారని చెప్పాలి.ఇక ఈ కార్యక్రమంలో ఐశ్వరరాయ్ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
ఇక వేదికపై ఐశ్వర్యరాయ్ మాట్లాడుతుండగా అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేయడంతో వారి అభిమానానికి ఈమె కృతజ్ఞతలు తెలిపారు.
ఇకపోతే ఈ సినిమా గురించి ఐశ్వర్యరాయ్ మాట్లాడుతూ ఇంత గొప్ప టీం తో పనిచేయడం ఎంతో గర్వంగా భావిస్తున్నానని ఈమె తెలిపారు.
ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి పనిచేసారని ఐశ్వర్యారాయ్ వెల్లడించారు.
సెల్యూలాయిడ్ పై ఒక అద్భుతమైన పెయింటింగ్‌లాగా మణిరత్నం ఈ సినిమాను తీర్చిదిద్దారని ఐశ్వర్య రాయ్ ఈ సినిమా గురించి ఎంతో గొప్పగా వర్ణించారు.
"""/"/
ఇప్పటివరకు నా సినీ కెరియర్లో ఈ సినిమా ఒక బెస్ట్ సినిమాగా నిలిచిపోతుందని తెలిపారు.
ఇక ఇదే వేదికపై ఐశ్వర్యరాయ్ డైరెక్టర్ మణిరత్నం నటి సుహాసిని దాంపత్య జీవితం గురించి కూడా మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఇక వీరిద్దరిలో బెటర్ ఆఫ్ ఎవరు అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం కష్టతరమని వాళ్ళిద్దరూ ఒక కంప్లీట్ పిక్చర్ అంటూ వారి దాంపత్య జీవితం గురించి ఐశ్వర్యరాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు.
ఇక సుహాసిని గారితో కలిసి తాను మొదటి సినిమా చేస్తున్నానని తాను తన కుటుంబ సభ్యురాలిగా మారిపోయారంటూ ఈ సందర్భంగా సుహాసిని గురించి ఐశ్వర్యరాయ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
నయనతార భర్త ఆస్తుల వివరాలు తెలిస్తే షాకవ్వాల్సిందే.. అంత సంపాదించారా?