Aishwarya Rai: అభిషేక్ కంటే ముందే దాన్ని పెళ్లి చేసుకున్న ఐశ్వర్య రాయ్.. ఇన్నాళ్లకు బయటపడ్డ సీక్రెట్..!!

సౌత్, నార్త్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ఐశ్వర్యరాయ్ ( Aishwarya Rai ) తాజాగా తన 50వ బర్త్ డే ని గ్రాండ్ గా జరుపుకొంది.

అయితే 50 ఏళ్ల వయసు వచ్చినా కూడా పాతికేళ్ల అమ్మాయి లాగా ఐశ్వర్యారాయ్ అందం ఉంటుంది.

అయితే అలాంటి ఐశ్వర్యారాయ్ మీద అప్పట్లో ఒక వార్త బాలీవుడ్ లో చాలా వైరల్ గా మారింది.

అదేంటంటే అభిషేక్ అంటే ముందే ఐశ్వర్యరాయ్ దాన్ని పెళ్లి చేసుకుందని,ఆ తర్వాతే రెండోసారి అభిషేక్ ( Abhishek ) ని పెళ్లి చేసుకుంది అని ఇలా ఎన్నో వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే ఆ సమయంలో ఐశ్వరరాయ్ దానిపై ఎక్కువగా క్లారిటీ ఇవ్వడానికి ఇష్టపడలేదు.ఇక రీసెంట్ గా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్యరాయ్ తన పెళ్లి విషయం గురించి సీక్రెట్ ని బయట పెట్టింది.

ఇక అసలు విషయంలోకి వెళ్తే.సౌత్ నార్త్ ఇండస్ట్రీలో ఐశ్వర్య రాయ్ అంటే తెలియని వారు ఉండరు.

1994లో సుస్మిత సేన్ ( Susmitha Sen ) మిస్ ఇండియాగా ఫస్ట్ ప్లేస్ లో ఉంటే ఐశ్వర్యరాయ్ సెకండ్ ప్లేస్ లో మిస్ ఇండియా గా ఉంది.

అలాగే అదే ఏడాది మిస్ వరల్డ్ గా టైటిల్ గెలిచిన ఈ ముద్దుగుమ్మ కేవలం సినిమాలు మాత్రమే కాకుండా కొన్ని వ్యాపార ప్రకటనల్లో కూడా నటించేది.

"""/" / ఇక అలాంటి ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ తో ధూమ్ 2 ( Dhoom 2 ) సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడి ఆయన్ని పెళ్లి చేసుకుంది.

అయితే వీరి పెళ్లి సమయంలో ఐశ్వర్యరాయ్ గురించి ఒక ఫేక్ న్యూస్ బయట ప్రచారం జరిగింది.

అదేంటంటే ఐశ్వర్యారాయ్ జాతకంలో దోషం వల్ల అభిషేక్ బచ్చన్ ఫ్యామిలీ ఆమెకు ముందుగా ఓ చెట్టును పెళ్లి చేసుకోమని చెప్పారని, ఆ తర్వాత అభిషేక్ బచ్చన్ ని రెండోసారి పెళ్లి చేసుకుందని వార్తలు వినిపించాయి.

అయితే ఈ వార్తలు వినగానే ఐశ్వర్యరాయ్ వామ్మో ఇదేంటి ఇలాంటి న్యూస్ అని ఆశ్చర్యపోయేదట.

"""/" / అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడుతూ.

అసలు నా పెళ్లి విషయంలో బచ్చన్ ఫ్యామిలీ నన్ను చెట్టుని పెళ్లి చేసుకోమని చెప్పారని జరిగిన ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.

ఇక ఏ చెట్టును పెళ్లి చేసుకున్నానో ఇలాంటి వార్తలు వైరల్ చేసిన వాళ్లే నాకు చూపించాలి.

బహుశా మీ ఉద్దేశంలో ఆ చెట్టు అభిషేక్ బచ్చన్ కావచ్చు అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చింది.

ప్రస్తుతం ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అంతేకాదు ఐశ్వర్యరాయ్ ( Aishwarya Rai ) క్లారిటీతో ఆమె పెళ్లి విషయంలో వచ్చిన ఫేక్ న్యూస్ కి తెరపడినట్లయింది.

బాలయ్య తండ్రికి తగ్గ తనయుడు…. బాలయ్య పై ప్రశంసలు కురిపించిన ఊర్వశి!