భార్య ఫోన్ చేస్తే ఒత్తిడికి గురవుతాను.. అభిషేక్ బచ్చన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

భార్య ఫోన్ చేస్తే ఒత్తిడికి గురవుతాను అభిషేక్ బచ్చన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్( Abhishek Bachchan ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

భార్య ఫోన్ చేస్తే ఒత్తిడికి గురవుతాను అభిషేక్ బచ్చన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

ఎన్నో సినిమాల్లో నటించి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అభిషేక్ బచ్చన్.ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

భార్య ఫోన్ చేస్తే ఒత్తిడికి గురవుతాను అభిషేక్ బచ్చన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

ఇకపోతే అభిషేక్ బచ్చన్ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ ( Aishwarya Rai ) ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

ఆ సంగతి అటు ఉంచితే తాజాగా ఒక అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు అభిషేక్ బచ్చన్.

ఇటీవల ఆయన నటించిన ఐ వాంట్‌ టు టాక్‌( I Want To Talk Movie ) చిత్రానికి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.

"""/" / తనకు ఈ అవకాశాన్ని ఇచ్చిన చిత్ర బృందానికి అభిషేక్‌ బచ్చన్ ధన్యవాదాలు తెలిపారు.

దర్శకుడి వల్లే తాను తండ్రి పాత్రలో ఒదిగిపోయానని తెలిపారు.అనంతరం ఆయన తన భార్య ఐశ్వర్య రాయ్‌ గురించి పరోక్షంగా మాట్లాడారు.

తోటి నటుడు, షో హోస్ట్‌ అర్జున్‌ కపూర్‌ తో సరదాగా సంభాషించారు.ఈ సందర్భంగా అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ.

ఉత్తమ నటుడిగా( Best Actor Award ) నేను అందుకున్న తొలి అవార్డు ఇదే.

ఈ అవార్డుకు నేను అర్హుడినని భావించిన కార్యక్రమం నిర్వాహకులకు, న్యాయ నిర్ణేతలకు ధన్యవాదాలు.

దర్శకుడు సూజిత్‌ సర్కార్‌ వల్లే నేను ఈ సినిమాలో అద్భుతంగా యాక్ట్‌ చేయగలిగాను.

ఆయనొక అద్భుతమైన చిత్రాన్ని రూపొందించారు.కాబట్టి ఈ పూర్తి క్రెడిట్‌ ఆయనకే దక్కుతుంది.

సినిమాలో నాకు కుమార్తెలుగా నటించిన అహిల్య, పెరల్‌ తో దీనిని పంచుకుంటాను. """/" / తోటి నటీనటుల నుంచే ఎంతో స్ఫూర్తి పొందుతున్నాను.

ఆయా చిత్రాల్లో వారి నటన చూసి వారిలా నేను కూడా చేయాలని అనుకుంటూ ఉంటాను.

నన్ను నేను ఉత్తమంగా మార్చుకునేందుకు వారు ఎంతగానో తోడ్పడుతున్నారు అని అభిషేక్‌ బచ్చన్‌ తెలిపారు.

అప్పుడు అక్కడే ఉన్న అర్జున్‌ కపూర్ మాట్లాడుతూ.‘నేను మీతో మాట్లాడాలి అంటూ ఎవరు ఫోన్‌ చేస్తే నీకు కంగారు వస్తుంది?అని ప్రశ్నించగా.

దీనికి అభిషేక్‌ నవ్వుతూ.నీకు ఇంకా పెళ్లి కాలేదు.

కాబట్టి నువ్వు ఇలా ప్రశ్నిస్తావు.ఒక్కసారి నీకు పెళ్లి అయితే ఈ ప్రశ్నకు నీ వద్ద కూడా ఒక సమాధానం ఉంటుంది.

భార్య ఫోన్ చేసి మీతో మాట్లాడాలి అంటే అసలైన గందరగోళానికి గురవుతావు.ఆ ఫోన్‌ కాల్స్‌ ఒత్తిడికి గురిచేస్తాయి అంటూ సరదాగా బదులిచ్చారు.

ఈ సందర్భంగా అభిషేక్ బచ్చన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

యువతి వెనుక ప్రైవేటు పార్ట్‌ను రుద్దిన ముసలి కామాంధుడు.. కట్ చేస్తే షాకింగ్ వీడియో..

యువతి వెనుక ప్రైవేటు పార్ట్‌ను రుద్దిన ముసలి కామాంధుడు.. కట్ చేస్తే షాకింగ్ వీడియో..