భర్తతో సినిమా చేయనన్న ఐశ్వర్యరాయ్.. దాని వెనుక ఎంత పెద్ద అర్థమో!

భర్తతో సినిమా చేయనన్న ఐశ్వర్యరాయ్ దాని వెనుక ఎంత పెద్ద అర్థమో!

ఇండస్ట్రీకి చెందిన నటీనటుల్లో ఎవరైనా ఎవరైనా రియల్ కపుల్స్ ఉంటే మాత్రం కలిసి నటించాలని అనుకుంటారు.

భర్తతో సినిమా చేయనన్న ఐశ్వర్యరాయ్ దాని వెనుక ఎంత పెద్ద అర్థమో!

కానీ అలా అందరికీ సాధ్యం కాదు.కొందరికి మాత్రం అటువంటి అవకాశాలు దక్కిన కూడా మంచి హిట్ అందుకోలేకపోతారు.

భర్తతో సినిమా చేయనన్న ఐశ్వర్యరాయ్ దాని వెనుక ఎంత పెద్ద అర్థమో!

మరికొందరు మాత్రం కొంతవరకు సక్సెస్ లు అందుకుంటారు.ఎంతైనా సినిమాలలో కట్టుకున్న వాళ్ళతో నటిస్తే ఆ థ్రిల్ వారికే కాదు చూసే ప్రేక్షకులకు కూడా బాగుంటుంది.

ఇదిలా ఉంటే మరో స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ తన భర్త తో సినిమా చేయనని చెప్పింది.

ఇంతకు అలా చెప్పడానికి అసలు కారణం ఏంటో తెలుసుకుందాం.బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన నటి ఐశ్వర్యరాయ్.

ఈమె నటన గురించి ఎంత చెప్పినా తక్కువే.ఈమె తన అందంతో ప్రపంచ సుందరిగా గుర్తింపు కూడా తెచ్చుకుంది.

తన అందంతో ఎంతోమంది అభిమానుల హృదయాలను దోచుకుంది.హిందీలో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

తెలుగులో కూడా పలు సినిమాలలో నటించింది.ఇక 2007 లో మరో బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకున్నా సంగతి తెలిసిందే.

వీరికి ఒక పాప కూడా ఉంది.ఇక పెళ్లి తర్వాత కూడా పలు సినిమాలలో నటించింది.

ఆ తర్వాత సినిమాలను కాస్త తగ్గించింది.సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా కూడా అభిమానులతో నిత్యం సోషల్ మీడియా వేదికగా టచ్ లో ఉంటుంది.

తనకు సంబంధించిన ఫోటోలను, తన కూతురు ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.అంతేకాకుండా సమాజంలో జరిగే కొన్ని విషయాలను కూడా పంచుకుంటుంది.

"""/"/ సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఇక ఈ మధ్య మళ్ళీ ఓ సినిమాలో నటిస్తున్నట్లు తెలిసింది.

కానీ అది ఎంత వరకు నిజమో క్లారిటీ రాలేదు.ఇదిలా ఉంటే తను అభిషేక్ బచ్చన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ఇక అభిషేక్ బచ్చన్ కూడా హిందీలో చాలా సినిమాలలో నటించాడు.కానీ ఇంతవరకు స్టార్ గా ఎదగలేక పోయాడు.

కారణం ఏంటో తెలియదు కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో అభిషేక్ బచ్చన్ కు క్రేజ్ అనేది తగ్గిపోయింది.

"""/"/ ఈ క్రేజ్ ఇప్పుడు అనే కాదు ఎప్పుడో తగ్గిపోయిందనే చెప్పవచ్చు.ఎందుకంటే స్వయంగా తన భార్య ఐశ్వర్య రాయే తనతో సినిమా చేయడానికి కూడా ఆసక్తి చూపలేకపోయింది.

2010లో ఐశ్వర్య రాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్ తో కలిసి దాదాపు నాలుగు సినిమాలలో నటించింది.

అందులో తాము సక్సెస్ అందుకుంది మాత్రం ఒకటే సినిమా.దీంతో దీనిని దృష్టిలో పెట్టుకుని ఐశ్వర్యరాయ్ ఇకపై తన భర్త అభిషేక్ బచ్చన్ తో కలిసి నటించడానికి ఇష్టం చూపలేకపోయింది.

"""/"/ ఈ విషయం గురించి నేరుగా అభిషేక్ తో చెప్పి అతడిని కూడా ఒప్పించిందట.

వారిద్దరు కలిసి నటించిన రావణ్ సినిమాపై ఐశ్వర్యరాయ్ ఎన్నో ఆశలు పెట్టుకుందట.కానీ ఆ సినిమా హిట్ కాకపోయే సరికి ఐశ్వర్యరాయ్ చాలా బాధపడిందని తెలిసింది.

ఇక ఈ సినిమా ప్లాప్ తో నిరాశ చెందడంతో ఆ సమయంలో తనకు ఏ సినిమాలలో అవకాశాలు వచ్చినా కూడా వదిలేసుకుందట.

అంతేకాదు తాను ఇక సినిమాలను కూడా తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకుందని తెలిసింది.కానీ తనకు పేరు తెచ్చే సినిమా ఉన్నట్లయితే ఏ భాషలోనైనా నటించడానికి సిద్ధంగా ఉన్నానని గతంలోని తెలిపింది ఐశ్వర్య రాయ్.

కొరియన్ యూట్యూబర్‌ని అలా చూసిన ఇండియన్.. ఆమె నిలదీస్తే అతడేం చెప్పాడో విని షాక్!