Aishwarya Lakshmi: ఈ ఫీల్డ్ లో కొనసాగాలంటే అలా మారాల్సిందే.. ఐశ్వర్య లక్ష్మి కామెంట్స్ వైరల్?

మామూలుగా సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే చాలా కష్టం.ఎన్నో రకాల కష్టాలను అవమానాలను ఒడిదుడుకులను ఎదుర్కోవాలి.

వాటన్నింటినీ తట్టుకొని గట్టిగా నిలబడితేనే ఇండస్ట్రీలో రాణించగలం.ముఖ్యంగా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే అంత ఈజీ విషయం కాదని చెప్పవచ్చు.

ప్రస్తుతం సినీ ప్రపంచంలో హీరోయిన్ల గ్లామర్ ట్రెండ్ నడుస్తోంంది.హీరోయిన్స్ సినీ రంగ ప్రవేశం చేయాలన్నా మరీ ముఖ్యంగా ఇక్కడ నిలదొక్కు కోవాలన్నా ప్రతిభ, గ్లామర్‌ ఫస్ట్ ప్రయారిటీగా మారిపోయింది.

ఈ విషయాన్ని సైతం చాలామంది హీరోయిన్లు పబ్లిక్‌ గానే అంగీకరిస్తున్నారు. """/" / అయితే తాజాగా హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి( Aishwarya Lakshmi ) ఈ విషయంపై స్పందిస్తూ అవుననే అంటున్నారు.

ఇంతకీ ఐశ్వర్య లక్ష్మి ఏం చెప్పింది అన్న విషయాన్ని వస్తే.ఐశ్వర్య లక్ష్మి కి మొదట నటనపై ఆసక్తి లేదట.

డాక్టర్ అవ్వాలి అనుకుని డాక్టర్ చదువు చదివిన ఐశ్వర్య లక్ష్మి ఆ తర్వాత మోడల్ రంగంపై ఆసక్తితో ఆ రంగంలోకి అడుగుపెట్టి అక్కడ సాధించి ఆ తర్వాత పలు వాణిజ్య సంస్థలకు మోడల్ గా పని చేసిందట.

అలా ఆమె ఫొటోలు పత్రికల్లో ముఖచిత్రంగా ప్రచురితమవడం, దాంతో సినిమా అవకాశాలు రావడం అలా జరిగిపోయిందట.

అలా మొదట మలయాళంలో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య లక్ష్మి 2019లో విశాల్‌ కథానాయకుడు నటించిన యాక్షన్‌ ( Action Movie )చిత్రం ద్వారా కోలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది.

ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. """/" / అదేవిధంగా ధనుష్‌కు జంటగా నటించిన జగమే తంధిరం( Jagama Thandiram ) కూడా నేరుగా ఓటీపీలో స్ట్రీమింగ్‌ కావడంతో ఆ చిత్రం కూడా ఈమెకు పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు.

ఆ తర్వాత విష్ణు విశాల్‌ సరసన నటించిన కట్టా కుస్తీ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో పూంగుళి పాత్రలో నటించి మెప్పించింది.

అదేవిధంగా సాయి పల్లవి రానా జనగా నటించిన గార్గీ తో నిర్మాతగా మారింది.

తాజాగా దుల్కర్‌ సల్మాన్‌కు జంటగా కింగ్‌ ఆఫ్‌ కోత్త చిత్రంలో నటించింది.భారీ అంచనాల మధ్య పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది.

దీంతో ఐశ్వర్య లక్ష్మి ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.అందుకు తగినట్లుగా గ్లామర్‌నే మార్గంగా ఎంచుకుంది.

అందాలను ఆరబోస్తూ తీయించుకున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయగా ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేశారు.

కాగా ఆ కామెంట్స్ పై స్పందించిన ఐశ్వర్య లక్ష్మి గ్లామర్‌కు మారడం తప్పనిసరి అని.

అది లేకపోతే ఈ ఫీల్డ్‌లో కొనసాగలేము ఆమె చెప్పుకొచ్చింది.