Aishwarya Lakshmi : నేను పక్కా అల్లు అర్జున్ ఫ్యాన్ ని.. స్టార్ హీరోయిన్ కామెంట్స్ వైరల్?
TeluguStop.com
తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
అల్లు అర్జున్( Allu Arjun ) ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన, అనసూయ, సునీల్, ఫహద్ ఫాజిల్ తదితరులు నటిస్తున్నారు.
గతంలో విడుదలైన పుష్ప సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.ఆ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే పుష్ప 2 నుంచి విడుదల అయిన పోస్టర్లు సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.
"""/" /
సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇకపోతే తాజాగా ఒక ప్రముఖ హీరోయిన్ అల్లు అర్జున్ గురించి చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఆ హీరోయిన్ మరెవరో కాదు మలయాళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి( Aishwarya Lakshmi )ఈమె తెలుగులో సత్యదేవ్ హీరోగా నటించిన గాడ్సే అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన విషయం తెలిసిందే.
ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వం( Ponniyin Selvan ) రెండు భాగాల్లోను ఐశ్వర్య నటించి మెప్పించింది.
"""/" /
అంతేకాకుండా నటనకు పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు సైతం అందుకుంది.
ఇక అసలు విషయంలోకి వెళ్తే తాజాగా ఐశ్వర్య లక్ష్మి అల్లు అర్జున్ గురించి స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
అల్లు అర్జున్ కి ఉన్న ఎంతో మంది అభిమానుల్లో నేను కూడా ఒకరు.
ఆయన స్టైల్, డ్రెస్ సెన్స్, యాక్టింగ్ చేసే విధానం సూపర్ గా ఉంటాయి.
ఆయన స్టైల్ ని మా లాంటి ఆర్టిస్ట్ లు కూడా ఫాలో అవుతారు.
నేను అయితే పక్కా అల్లు అర్జున్ ఫ్యాన్ ని అని ఘంటా పథంగా నొక్కి చెప్పింది ఐశ్వర్య లక్ష్మి.
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వావ్, మెక్‌డొనాల్డ్స్ లాంటి అమ్యూజ్‌మెంట్ పార్క్.. అంతా ఏఐ మహిమ..!