Aishwarya Lakshmi : నటిని అవుతానంటే మా తల్లిదండ్రులు అంగీకరించలేదు: హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీనటులకు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్( Celebrities Family Background ) ఉంటే మరి కొంతమందికి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సెలబ్రిటీలుగా గుర్తింపు తెచ్చుకున్న వారు చాలామంది ఉన్నారు.

ఇంకొంతమంది నటీనటులు ఇంట్లో వాళ్ళను ఎదిరించి మరి సినిమా ఇండస్ట్రీలకు ఎంట్రీ ఇచ్చి కష్టపడి మంచి పేరును సంపాదించుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు.

అటువంటి వారిలో నటి ఐశ్వర్య లక్ష్మి( Actress Aishwarya Lekshmi ) కూడా ఒకరు.

ఇంట్లో వాళ్ళు వద్దు అన్న కూడా ఆమె వారిని ఎదిరించి మరీ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

"""/" / ఇదే విషయం గురించి ఆమె చెప్పుకొచ్చింది.మాది ఒక మధ్య తరగతి కుటుంబం.

నేను ఎం.బి.

బి.ఎస్‌ పూర్తి చేశాను.

వైద్యురాలిగానే కెరీర్‌ ఊహించుకున్నాను.కానీ, అనుకోకుండా నటిని అయ్యాను.

ఇది విధి నిర్ణయం కావచ్చు.అయితే, నాకు నటిగా అవకాశం వచ్చినప్పుడు ఇంట్లో వాళ్లు అస్సలు అంగీకరించలేదు.

ఎంతగానో వ్యతిరేకించారు.సమాజంలో విన్న మాటల ప్రకారం సినిమా రంగం( Film Industry )పై వాళ్లకు నెగెటివ్‌ అభిప్రాయం ఉండేది.

దాంతో యాక్టింగ్‌ని గౌరవప్రదమైన కెరీర్‌గా వాళ్లు భావించలేదు.ఇప్పటికీ వాళ్లు నా కెరీర్‌ విషయంలో అంత సుముఖంగా లేరు.

"""/" / ఇక, నా దృష్టిలో సినీ పరిశ్రమలో కొనసాగడం అంత సులభమైన విషయం కాదు.

ప్రతిరోజూ పోరాటం చేయాల్సి ఉంటుందిఅని ఆమె తెలిపింది.Njandukalude Nattil Oridavela అనే మలయాళీ సినిమాతో ఐశ్వర్య నటిగా ఎంట్రీ ఇచ్చింది.

ఆ సినిమా విజయం సాధించడంతో ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి.మలయాళంలోనే కాకుండా తమిళం, తెలుగులో ఆమె మెప్పించింది.

తెలుగులో గాడ్సే సినిమా( Godse )తో తెలుగు తెరకు పరిచయమైన ఆమె అమ్ము సినిమాతో ప్రేక్షకులకు మరింత చేరువ అయింది.

పూరీ జగన్నాథ్ సినిమాలకు గుడ్ బై చెప్పాలంటూ కామెంట్స్.. అనుమానమే అంటూ?