టాంజానియాలోని సరస్సులో కూలిన విమానం

టాంజానియాలోని విక్టోరియా సరస్సులో ఓ విమానం కుప్పకూలింది.సుమారు 50 మందితో ప్రయాణిస్తున్న విమానం సరస్సులో పడిపోయినట్లు తెలుస్తోంది.

ప్రయాణికులతో వెళ్తున్న ప్రెసిషన్ ఎయిర్ విమానం మరి కాసేపట్లో ఎయిర్ పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉండగా ప్రమాదం జరిగింది.

ప్రతికూల వాతావరణం కారణంగా విమానం కుప్పకూలినట్లు పోలీసులు తెలిపారు.అప్రమత్తమైన అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టారు.

ఇప్పటివరకు 15 మంది సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.అయితే ప్రమాదం జరిగే సమయానికి విమానంలో ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత లేదు.

ప్రమాదంలో ఎవరైనా మరణించారా అనే విషయం త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

గేమ్ చేంజర్ సినిమా సక్సెస్ అవుతుందా..?