ఎన్ఆర్ఐలకు శుభవార్త.. త్వరలో బెంగళూరు నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు ఎయిరిండియా డైరెక్ట్ ఫ్లైట్స్

దక్షిణ భారతదేశం నుంచి అమెరికాలో స్థిరపడిన వారికి, చదువు, ఉద్యోగాల కోసం వెళ్లిన వారికి ఎయిరిండియా శుభవార్త చెప్పింది.

కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు ఇకపై నేరుగా విమానాలు నడుపుతున్నట్లు ప్రకటించింది.

అక్టోబర్ చివరి నుంచి ఈ సర్వీసులు నడపనుంది.ఈ శీతాకాల షెడ్యూల్‌లో రెండు నగరాల మధ్య వారానికి రెండుసార్లు నాన్‌స్టాప్ సర్వీసును ప్రారంభిస్తామని ఎయిరిండియా వెల్లడించింది.

అయితే బెంగళూరు- శాన్‌ఫ్రాన్సిస్కో మధ్య యునైటెడ్ ఎయిర్‌లైన్స్ కూడా డైరెక్ట్ సర్వీస్ ప్రారంభించాలని భావించింది.

కానీ పాశ్చాత్య విమానాయాన సంస్థలు రష్యా గగనతలంలో ప్రయాణించకపోతుండటంతో ఈ ప్రతిపాదన వాయిదా పడుతూ వస్తోంది.

అలాగే బెంగళూరు- సీటెల్‌ల మధ్య నాన్‌స్టాప్ ఫ్లైట్ ప్రారంభించాలని భావించిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రతిపాదన కూడా కార్యరూపం దాల్చలేదు.

ఈ నేపథ్యంలో ఎయిరిండియా చొరవ చూపింది.భారత సంతతికి చెందిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియా, సీటెల్ తదితర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో స్థిరపడటంతో బెంగళూరు- శాన్‌ఫ్రాన్సిస్కో రూట్‌కు మంచి డిమాండ్ వుంది.

ఈ మార్గంపై ఆధిపత్యం సాధించాలని పలు ఎయిర్‌లైన్స్‌లు ప్రణాళికలు రచించినా ఆచరణ సాధ్యం కాలేదు.

ఇదే సమయంలో సెప్టెంబర్ మొదటి వారంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికా పర్యటన సందర్భంగా అక్కడి భారత సంతతి పారిశ్రామికవేత్తలు ఈ రూట్‌లో డైరెక్ట్ కనెక్టివిటీ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

"""/" / ఇకపోతే.భారత్ - అమెరికాల మధ్య నాన్‌స్టాప్ విమానాలను నడిపే అతిపెద్ద ఆపరేటర్‌గా ఎయిరిండియా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.

ఎందుకంటే ఎయిరిండియా ఇప్పటికీ రష్యన్ గగనతలం మీదుగానే అమెరికాకు విమానాలు నడుపుతోంది.తద్వారా సాధ్యమైనంత తక్కువ సమయంలోనే ప్రయాణీకులను అమెరికాకు చేరుస్తోంది.

ఆక్యూపెన్సీ పెంచుకునేందుకు గాను ఇటీవల ఐదు బోయింగ్ 777 లాంగ్ రేంజ్ విమానాలను ఎయిరిండియా లీజుకు తీసుకుంది.

ఈ విమానాలు ఈ ఏడాది డిసెంబర్ - వచ్చే ఏడాది మార్చి మధ్య ఎయిరిండియా ఫ్లీట్‌లో చేరతాయి.

ఇవి చేరిన తర్వాత బెంగళూరు నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు వారానికి మూడుసార్లు విమాన సర్వీసులు నడిపే వెసులుబాటు కలుగుతుంది.

నేటి నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర