వింగ్ కమాండర్ అభినందన్ బదిలీ అంతలో అరుదైన గౌరవం!

పాకిస్తాన్ యుద్ధ విమానంని నేలకూల్చి అనుకోకుండా వారికి యుద్ధ ఖైదిగా చిక్కిన వింగ్ కమాండర్ అభినంధన్, జెనివా ఒప్పందం అనుసరించి భారత్ కి అప్పగించింది.

అనంతరం అతనికి అనేక వైద్య పరీక్షలు నిర్వహించిన మీదట అతను తిరిగి విధుల్లో చేరాడు.

అయితే విధుల్లో చేరిన ఒక్కరోజులోనే ఊహించని విధంగా అతని వాయుసేన బదిలీ చేసింది.

శ్రీనగర్ ఎయిర్బేస్ నుంచి ఆయనను పాకిస్థాన్ సరిహద్దుల్లోని వెస్ట్రన్ సెక్టార్కు బదిలీచేశారు.భద్రతా కారణాల రీత్యా ఈ బదిలీ జరిగినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు.

ఇదిలా ఉంటే మరో వైపు బదిలీ చేసిన తర్వాత అభినంధన్ వాయుసేన వీర చక్ర అవార్డుకి నామినేట్ చేసి అరుదైన గౌరవం ఇచ్చింది.

భారత్ తరుపున యుద్ధాలలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి ప్రభుత్వం మూడు అత్యున్నత పురష్కారాలు ఇస్తుంది.

అందులో మూడో అత్యున్నత పురష్కారం అయిన వీరచక్రని అభినంధన్ ని నామినేట్ చేయడం ద్వారా అతని ధైర్య సాహసాలని గుర్తించినట్లు అయ్యింది.

చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చరణ్.. ఎంత చక్కగా పాడారో?