బాటిళ్లలో అమ్మకానికి గాలి… ధర ఎంతో తెలుసా?
TeluguStop.com
కొన్నేళ్ల క్రితం పెద్దవారు చెబుతుండే మాట భవిష్యత్తులో గాలి కూడా కొనుక్కునే పరిస్థితి వస్తుందేమో అని.
కాని ప్రస్తుతం కర్బన ఉద్గారాల వెలువడటం వల్ల గాలి, నీరు పూర్తిగా కలుషితమవుతోంది.
ఢిల్లీలో వాయు కాలుష్యం ఎంతలా ఉంటుందో మనకు తెలిసిందే.ఢిల్లీలో గాలి ట్యూబ్స్ అమ్మిన పరిస్థితి ఉంది.
ఎందుకంటే స్వచ్ఛమైన గాలి అనేది అక్కడ దొరకక, అప్పటి పరిస్థితులలో గాలిని పీలిస్తే అనారోగ్య సమస్యలు వస్తాయని భయానికి లోనైన పరిస్థితి ఉంది.
ఇక అసలు విషయానికొస్తే యూకేలో స్బచ్చమైన గాలి బాటిల్స్ లో ఇస్తున్నామంటూ పెద్ద ఎత్తున వ్యాపారం మొదలైంది.
ఇప్పుడు ఈ వార్త హల్ చల్ చేస్తోంది.అసలు గాలిని అమ్మడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు.
ఆ గాలి బాటిల్ ధర ఎంతో తెలుసా 2000 రూపాయలు.2 వేల రూపాయలు పెట్టి గాలి బాటిల్ ని ఎవరు కొంటారని మీరు అనుకోవచ్చు.
ప్రస్తుతం మనం కొనుక్కొంటున్న కొన్ని వస్తువులను అప్పట్లో అమ్ముతున్నారంటే ఆ కాలం ప్రజలు కూడా నమ్మలేదట.
ఎందుకంటే అప్పటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉంది.ఏది ఏమైనా నీటిని కొనుక్కొనే పరిస్థితి వచ్చింది.
భవిష్యత్తులో స్వచ్ఛమైన గాలిని కూడా కొనుక్కోవాల్సి వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.మనం చేసుకున్నది దాని ఫలితాన్ని మనమే అనుభవించాల్సి వస్తోంది.
భారతీయులపై అమెరికన్ విషం.. ‘H1B వైరస్’ అంటూ.. వీడియో చూస్తే రక్తం మరిగిపోతుంది!