భారత్‌కు నెట్‌వర్క్‌ విస్తరించే వ్యూహం .. సీట్ల సామర్ధ్యం పెంపుపై ఎయిర్ కెనడా ఫోకస్

కెనడా( Canada)లో అతిపెద్ద విమానయాన సంస్థ ‘‘ఎయిర్ కెనడా ( Air Canada ) భారతదేశానికి తన విమాన నెట్‌వర్క్‌ను విస్తరించనున్నట్లు సోమవారం ప్రకటించింది.

రాబోయే శీతాకాలం సీజన్‌కు గాను అక్టోబర్ చివరి నుంచి 40 శాతం సీట్ల సామర్ధ్యాన్ని పెంచాలని భావిస్తోంది.

కెనడా నుంచి భారతదేశానికి ఈ శీతాకాలంలో ప్రతి వారం 7,400 సీట్ల కెపాసిటీతో వీక్లీ విమానాలను నడపనున్నట్లు ఎయిర్ కెనడా వెల్లడించింది.

ఇందులో 11 వీక్లీ విమానాలు ఉంటాయి.టొరంటో నుంచి ఢిల్లీ, ముంబైకి .

మాంట్రియల్ నుంచి ఢిల్లీకి రోజువారీ విమానాలు నడుపుతామని సంస్థ తెలిపింది.అలాగే పశ్చిమ కెనడా నుంచి లండన్ హీత్రూ( Heathrow Airport ) ఎయిర్‌పోర్ట్ మీదుగా ఢిల్లీకి రోజువారీ విమానాలు ఉంటాయని వెల్లడించింది.

"""/" / ఎయిర్ కెనడా భారత్‌కు 25 వీక్లీ ఫ్లైట్స్‌ను నడపనుంది.ఇరుదేశాల మధ్య నడిచే ఏ ఎయిర్‌లైన్‌లోనూ ఇలాంటి ఆఫర్ ఎందులోనూ లేదు.

ఎయిర్‌ కెనడాకు భారత్ కీలక మార్కెట్.రెండు దేశాల మధ్య పెరుగుతున్న కుటుంబ, వాణిజ్య సంబంధాల నేపథ్యంలో ఈ ఎయిర్‌లైన్స్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

దీపావళి ఉత్సవాల సమయంలో మా హబ్‌లలో అదనపు స్థాయిని నిర్మించడం ద్వారా మా నెట్‌వర్క్‌ను ముంబై, ఢిల్లీ( Mumbai, Delhi )కి విస్తరిస్తామని ఎయిర్ కెనడా రెవెన్యూ అండ్ నెట్‌‌వర్క్ ప్లానింగ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మార్క్ గలార్డో తెలిపారు.

టొరంటో-ముంబై ఫ్లైట్ ఇరు దేశాల్లోని రెండు పెద్ద నగరాలను కలిపే ఏకైక నాన్‌స్టాప్ ఫ్లైట్.

బోయింగ్ 777-200 ఎల్ఆర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఇందుకోసం వినియోగిస్తున్నారు. """/" / కాగా .

గతేడాది కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో పంజాబ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కుల్‌దీప్ సింగ్ ధాలివాల్‌ భేటీ అయిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా కెనడా, అమెరికాలకు పంజాబ్ నుంచి నేరుగా విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకురావాలని ధాలివాల్ కోరారు.

ఈ మేరకు జ్యోతిరాదిత్య సింధియాకు ఆయన వినతిపత్రం అందజేశారు.కెనడా, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్ , చికాగో, సీటెల్, శాన్‌ఫ్రాన్సిస్కోలకు .

అమృత్‌సర్, మొహాలీల నుంచి డైరెక్ట్ ఫ్లైట్ నడపాలని కుల్‌దీప్ విజ్ఞప్తి చేశారు.ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే ఇరువైపులా ప్రయాణీకులు భారీగా లబ్ధిపొందుతారని ఆయన వినతిపత్రంలో పేర్కొన్నారు.

పంజాబ్‌కు చెందిన ప్రవాస భారతీయులు, పంజాబ్ మూలాలున్న వారు కెనడా, అమెరికాల( Canada, America )లో పెద్ద సంఖ్యలో వున్నారని కేంద్రమంత్రి దృష్టికి కుల్‌దీప్ తీసుకెళ్లారు.

ఈ దేశాల్లో నివసిస్తున్న పంజాబీ కమ్యూనిటీని డైరెక్ట్ ఫ్లైట్ సమస్య ధీర్ఘకాలంగా వేధిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా సింధియాను ధాలివాల్ కోరారు.