కేంద్ర హోం మంత్రి, బీజేపీ పార్టీ సీనియర్ నేత అమిత్ షా కోలుకున్నట్లు అఖిల భారత వైద్య,విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్) తాజాగా శనివారం ప్రకటించింది.
ఇటీవల కోవిడ్-19 బారిన పడిన ఆయన మళ్లీ అస్వస్థత కు గురికావడం తో ఆగస్టు 18 న మరోసారి ఎయిమ్స్ లో చేరిన విషయం విదితమే.
అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడడం తో త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నట్లు ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.
ఇటీవల ఆగష్టు 2 న కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు కరోనా పాజిటివ్ రావడం తో ఆసుపత్రిలో చికిత్స పొంది క్షేమంగా ఆగస్టు 14 న బయటకు వచ్చారు.
అయితే ఆ తరువాత కూడా ఆయనకు కొంచం అలసట,ఒళ్ళు నెప్పులు ఉండడం తో తిరిగి ఆగష్టు 18 న మరోసారి ఆయన ఆసుపత్రిలో చేరారు.
తిరిగి ఆయనకు మరోసారి వైద్యులు చికిత్స అందించడం తో ఆయన ఆరోగ్యం మెరుగుపడింది అని త్వరలోనే ఆయనను ఇంటికి పంపిస్తాం అంటూ వైద్యులు తెలిపారు.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే.రోజు రోజుకు పెరుగుతున్న కేసులతో పాటు రికవరీ రేటు కూడా పెరగడం తో కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు.
అయితే గాలి ద్వారాకూడ ఈ వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తుంది అని దీనిని అంత తేలిగ్గా తీసుకోరాదు అంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి విష్ణు వర్ధన్ హెచ్చరిస్తున్నారు కూడా.
రికవరీ రేటు పెరుగుతున్నంత మాత్రానా ప్రజలు నిర్లక్ష్యం గా వ్యవహరించకూడదు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.