ప్రజల బాట పట్టిన బీర్ల ఐలయ్య
TeluguStop.com
యాదాద్రి భువనగిరి జిల్లా: ఆలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్ల ఐలయ్య తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
సోమవారం యాదగిరిగుట్ట పాదాల వద్ద తన ఎన్నికల ప్రచార రథాన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం బొమ్మలరామారం మండలంలోని పెద్ద పర్వతాపూర్,ప్యారారం, తిమ్మాపురం,బోయిన్‌పల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయనకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది.ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని,కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీని అమలు చేసి అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ కాపాడుతుందని భరోసా ఇచ్చారు.
బొమ్మల రామారం మండలంలో రెండు రోజుల పాట బీర్ల ఐలయ్య ప్రచారం కొనసాగుతుందని
కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.