భవిష్యత్తులో ఏఐ ఆధారిత రోబోలతో శృంగారం.. గూగుల్ మాజీ ఎగ్జిక్యూటివ్ గవాదత్

ప్రతి మనిషికే కాకుండా ప్రతి జీవికీ యుక్త వయసు వచ్చాక శృంగారం అవసరం పడుతుంది.

తరచూ ఆరోగ్యకర శృంగారం చేసే వారి మెదడు చురుగ్గా పని చేస్తుందని పలు నివేదికలు వెల్లడించాయి.

అయితే శృంగారపరమైన సమస్యల వల్ల చాలా జంటలు విడిపోతున్నాయి.ఇదే కాకుండా చాలా మంది అసురక్షిత శృంగారం చేసి ప్రమాదకర జబ్బుల బారిన పడుతుంటారు.

ఈ పరిస్థితులకు భవిష్యత్‌లో చెక్ పడనుంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన రోబోలు( AI Robots ) రానున్న సమీప భవిష్యత్తులో మనుషులతో శృంగారం చేయనున్నాయట.

ఈ అసాధ్యం త్వరలోనే సుసాధ్యం అవుతుందని గూగుల్ సంస్థ మాజీ ఎగ్జిక్యూటివ్ మొహమ్మద్ మో గవాదత్( Mo Gawdat ) వెల్లడించారు.

కృత్రిమ మేధ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

"""/" / యూట్యూబ్‌లో టామ్ బిల్యుతో "ఇంపాక్ట్ థియరీ"( Impact Theory ) పోడ్‌కాస్ట్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాదత్ దీని గురించి మాట్లాడారు.

ఆపిల్ యొక్క విజన్ ప్రో లేదా క్వెస్ట్ 3 వంటి ప్రత్యేక హెడ్‌సెట్‌లను ఉపయోగించి వర్చువల్ రియాలిటీలో మనకు విషయాలను చూపించే లైంగిక అనుభవాలను నటింపజేయడానికి ఏఐ ఉపయోగపడుతుందని గవాదత్ వెల్లడించారు.

ఏఐ పవర్డ్ బాట్‌ల సహాయంతో, మనం నిజంగా నిజమైన సెక్స్ రోబోట్‌లతో ఇంటరాక్ట్ అవుతున్నట్లుగా అనిపిస్తుందని చెప్పారు.

కొన్నిసార్లు మన మెదళ్లను నిజం కాని వాటి ద్వారా సులభంగా మోసగించవచ్చని గవాదత్ వివరించారు.

"""/" / ఏఐ మానవులలా ప్రవర్తించగలిగితే, అనుభూతి చెందగలిగితే, మన అనుభవాలు నిజమో కాదో తెలుసుకోవడం మనకు కష్టంగా ఉండవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.

భవిష్యత్తులో మనకు మానవ భాగస్వామి( Human Partner ) అవసరం కూడా ఉండకపోవచ్చు.

ఏఐ ఆధారిత భాగస్వాములను కలిగి ఉండడం భవిష్యత్తులో సర్వసాధారణం అవుతుందని ఆయన పేర్కొన్నారు.

మరో మనిషి మన పక్కన ఉంటే కలిగే అనుభూతి ఏఐ రోబోలతో సాధ్యం కాదనే అభిప్రాయాలున్నా, భవిష్యత్తులో ఏఐ రోబోలు కూడా మనిషిలా ఆలోచించి ప్రవర్తిస్తే ఆ సమస్య కూడా ఉండదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

గురుద్వారాలో ఘర్షణ .. బెల్జియంలో భారత సంతతి సిక్కు మృతి