Allu Arjun: బన్నీ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యూటీ.. ఏఐ దెబ్బకు హీరోయిన్లకు అవకాశాలు లేనట్లేనా?
TeluguStop.com
ఇటీవల కాలంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్( Artificial Intelligence ) ద్వారా చాలా రకాల మ్యాజిక్ లు చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ రంగం, ఆ రంగం అనే తేడా లేకుండా అన్నింట్లోనూ ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సత్తా చాటుతోంది.
ఈ టెక్నాలజీతో కొత్త కొత్త ప్రయోగాలు కూడా చేస్తున్నారు.ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా ఏఐ బ్యూటీని తీసుకోవాలని అనుకుంటన్నారట.
త్వరలోనే త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్( Allu Arjun ) ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.
ఈ మూవీ లోనే ఈ ఏఐ బ్యూటీని తీసుకోవాలని అనుకుంటున్నారట.అందంగా మెరిసిపోయేలా ఉండాలని ప్లాన్ చేస్తున్నారట.
"""/" /
మరి ఈ విషయంలో ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు.
కాగా ఈ విషయం గురించి త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.అంతేకాకుండా, ఈ మూవీలో అల్లు అర్జున్ పాత్ర విషయంలోనూ త్రివిక్రమ్( Trivikram ) చాలా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
మహాభారతం లోని ఒక పాత్రను ఇన్సిపిరేషన్ గా తీసుకొని డిజైన్ చేస్తున్నారట.మహాభారతం లోని పర్వాల కు మోడ్రన్ టచ్ ఇచ్చి కథను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ లో( Pushpa 2 ) నటిస్తున్నారు.
మొదటి భాగం బ్లాక్ బస్టర్ కాగా, దానికి సీక్వెన్స్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
ఈ మూవీ లో అల్లు అర్జున్ సరసన రష్మిక నటిస్తోంది. """/" /
కాగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై చాలా అంచనాలు ఉన్నాయి.
ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది పుష్ప 2 తర్వాత పుష్ప 3 కూడా వస్తుందని మరో ప్రచారం జరుగుతోంది.
ఇప్పుడు త్రీక్వెల్ స్క్రిప్ట్‌ను సుకుమార్ ఫ్రాంచైజీగా చేయాలనే ఉద్దేశ్యంతో పుష్పకు సిద్ధం చేసినట్లు ఆన్‌లైన్ లో గాసిప్ చక్కర్లు కొడుతోంది.
సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప 2 సంబంధించిన షూటింగ్ శరవేయంగా జరుగుతున్న విషయం తెలిసిందే.