వచ్చే నెలలో అమెరికాకు నరేంద్రమోడీ మోడీ.. ప్రవాస భారతీయులతో మెగా ఈవెంట్‌కు ఏర్పాట్లు

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ అక్కడ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.డెమొక్రాటిక్ పార్టీ నుంచి కమలా హారిస్( Kamala Harris ), రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump )ఎన్నికల్లో తలపడనున్నారు.

వీరిద్దరికి మద్ధతు ఇచ్చే వారి సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోంది.ఓపీనియన్ పోల్స్, ముందస్తు సర్వేల ప్రకారం ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరుగుతాయని టాక్.

ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi ) అమెరికా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

సెప్టెంబర్ చివరి వారంలో అగ్రరాజ్యంలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని భారత ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

అలాగే అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులు నిర్వహించే కార్యక్రమంలోనూ మోడీ పాల్గొంటారని తెలుస్తోంది.

మూడు నెలల్లో అమెరికా ఎన్నికల వేళ భారత ప్రధాని అగ్రరాజ్యంలో అడుగుపెట్టడం చర్చనీయాంశమైంది.

"""/" / అమెరికాలోని డెమెక్రాట్లు, రిపబ్లికన్లకు ( Democrats And Republicans In America )ప్రధాని మోడీ కావాల్సిన వ్యక్తే.

గతంలో 2020 అధ్యక్ష ఎన్నికలకు ముందు అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో హౌడీ మోడీ ఈవెంట్‌కు హాజరయ్యారు.

నాటి సభకు దాదాపు 50 వేల మందికి పైగా హాజరయ్యారని అంచనా.ఈసారి ఎన్నికల్లో నరేంద్రమోడీ ఏ పార్టీకి మద్ధతు పలుకుతారోనని ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

"""/" / అమెరికా పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 22న ‘Modi & US' Progress Together' ఈవెంట్‌లో మోడీ పాల్గొననున్నారు.

15 వేల మంది కెపాసిటీ ఉన్న నసావు వెటరన్స్ మెమోరియల్ కొలీజియంలో ఈ కార్యక్రమం జరగనుంది.

ఈ మెగా ఈవెంట్‌కు హాజరయ్యేందుకు ఇప్పటికే 24 వేల మంది భారతీయ అమెరికన్లు రిజిస్టర్ అయినట్లుగా ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యూఎస్ఏ మంగళవారం తెలిపింది.

ఐక్యరాజ్యసమితి వర్గాల సమాచారం ప్రకారం సెప్టెంబర్ 26న అత్యున్నత స్థాయి యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో మోడీ ప్రసంగిస్తారని కూడా వార్తలు వస్తున్నాయి.

అయితే ప్రధాని అమెరికా పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

తప్పు తెలుసుకున్న దొంగ.. 150 ఏళ్ళ నాటి దేవతా విగ్రహం చోరీ.. ఆపై నాకొద్దు అంటూ?