అహం బ్రహ్మస్మికి రామోజీలో ముహూర్తం పెట్టిన మంచు మనోజ్
TeluguStop.com
చాలా గ్యాప్ తర్వాత మంచు మనోజ్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్ర అహం బ్రహ్మాస్మి.
సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కే ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు.
మనోజ్ కెరియర్ లో అత్యధిక బడ్జెట్ చిత్రంగా ఇది ఉండబోతుంది అని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాని లాక్ డౌన్ కి ముందే ఎనౌన్స్ చేసి షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు చెప్పారు.
అయితే కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్ వాయిదా పడిపోయింది.ఇక లాక్ డౌన్ సడలింపులతో పాటు సినిమా షూటింగ్ లకి పర్మిషన్ ఇవ్వడంతో ఈ సినిమా షూటింగ్ కి రంగం సిద్ధం చేస్తున్నారు.
వచ్చే నెల నుంచి రామోజీ ఫిలిం సిటీలో అహం బ్రహ్మసి సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.
ముందుగా పీటర్ హెయిన్స్ నేతృత్వంలో యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు.
శ్రీకాంత్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.ఇక ఈ సినిమాలో మనోజ్ అఘోరా పాత్రలో కనిపించబోతున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యి సినిమా మీద హైప్ క్రియేట్ చేసింది.
మరి ఈ మధ్యకాలంలో వరుస ఫ్లాప్ లతో ఉన్న మనోజ్ కి ఈ సినిమా ఎంత వరకు సక్సెస్ ఇస్తుంది అనేది చూడాలి.
వయస్సు 69.. లుక్స్ మాత్రం 29.. చిరంజీవి లేటెస్ట్ లుక్స్ చూస్తే మాత్రం షాకవ్వాల్సిందే!