క్రాక్ ఓటీటీ రిలీజ్ డేట్ ఛేంజ్.. ఆ హీరో వల్లేనా..?

రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కి ఈ ఏడాది తొలి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది క్రాక్ సినిమా.

ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని రవితేజ కెరీర్ కు ఈ సినిమా ప్లస్ అయింది.

క్రాక్ హిట్ కావడంతో రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ఖిలాడీ సినిమాపై కూడా భారీగా అంచనాలు పెరిగాయి.

క్రాక్ సినిమా ఓటీటీ హక్కులను 8 కోట్ల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేసి ఆహా కొనుగోలు చేసింది.

ఇప్పటివరకు చిన్న సినిమాలను ఎక్కువగా కొనుగోలు చేసిన ఆహా పెద్ద సినిమాల డిజిటల్ హక్కుల కొనుగోలు దిశగా క్రాక్ సినిమాతో అడుగులు వేసింది.

అయితే మొదట జనవరి 29వ తేదీ నుంచి క్రాక్ సినిమా ఆహా ఓటీటీలో అందుబాటులోకి వస్తుందని జోరుగా ప్రచారం జరిగింది.

అయితే బాక్సాఫీస్ దగ్గర క్రాక్ సినిమాకు కలెక్షన్లు బాగానే వస్తుండటంతో ఓటీటీలో విడుదల చేస్తే డిస్ట్రిబ్యూటర్లు నష్టపోవాల్సి వస్తుందని కామెంట్లు వ్యక్తమయ్యాయి.

"""/"/ అయితే ఆహా ఓటీటీ క్రాక్ రిలీజ్ డేట్ ను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు కీలక ప్రకటన చేసింది.

జనవరి 29వ తేదీనే స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉన్నా స్వార్థంగా ఆలోచించకుండా ఆహా స్ట్రీమింగ్ ను వాయిదా వేయడం గమనార్హం.

అయితే స్టార్ హీరో రవితేజ కోరడం వల్లే ఆహా క్రాక్ రిలీజ్ ను వాయిదా వేసిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఆహా క్రాక్ రిలీజ్ డేట్ ను వాయిదా వేసి టాలీవుడ్ మనస్సును కూడా గెలుచుకుందని చెప్పవచ్చు.

ఆహా ఓటీటీ తీసుకున్న నిర్ణయం వల్ల భవిష్యత్తులో మరి కొంతమంది నిర్మాతలు తమ సినిమాలను ఆహాకు డిజిటల్ హక్కులు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి.

రీ రిలీజ్ కి సిద్ధమైన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్… ఎన్నికలలో హైప్ కోసమేనా?