త్వరలో రానున్న ఆహా వార్తాపత్రిక… అల్లు అరవింద్ ప్లాన్ మామూలుగా లేదుగా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు వారి కుటుంబానికి( Allu Family ) ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి మనకు తెలిసిందే.

అల్లు రామలింగయ్య ఇండస్ట్రీలో కొనసాగుతూ అనంతరం తన కుమారుడు అల్లు అరవింద్ ను( Allu Aravind ) ఇండస్ట్రీకి నిర్మాతగా పరిచయం చేశారు.

ఇలా నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ ( Geetha Arts Banner ) ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించారు.

అలాగే ఆహా( Aaha ) అనే తెలుగు ఓటిపి ప్లాట్ ఫామ్ ను స్థాపించి మంచి సక్సెస్ అందుకున్నారు.

"""/" / ఇకపోతే తాజాగా అల్లు అరవింద్ మీడియా రంగంలోకి కూడా అడుగు పెట్టబోతున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఆహా వార్తాపత్రికను( Aaha News Paper ) కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే ఈ విషయాన్ని అల్లు అరవింద్ ట్విట్టర్ వేదికగా తెలియజేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అల్లు అరవింద్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయం గురించి రాసుకొస్తూ పొద్దున్నే ఒక చేతిలో కాఫీ మరొక చేతిలో పేపర్ ఆహా ఆ ఊహా చాలా బాగుంది కదా అంటూ ఆహా దినపత్రిక మీ ముంగిట్లో అంటూ అల్లు అరవింద్ తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.

"""/" / ఇలా అల్లు అరవింద్ ఇలాంటివి క్రియేట్ చేయడంతో త్వరలోనే వీరు ఆహా వార్తా పత్రికను ప్రారంభించబోతున్నారా లేకపోతే ఏదైనా సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇలాంటి స్టంట్ వేస్తున్నారా అనే విషయం తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అల్లు అరవింద్ ఇలా ట్వీట్ చేయడమే కాకుండా ఆహా అనే ఒక మోస్ట్ హెడ్ తో ఉన్న పత్రిక ఫోటో కూడా పెట్టడం జరిగింది.

దీన్ని చూశాక డౌట్స్ మరిన్ని ఎక్కువయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి.మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో త్వరలోనే తెలియనుంది.