ఆహా ఇండియన్ ఐడల్ సెకండ్ సీజన్ ఈసారి మరింత గ్రాండ్ గా..!
TeluguStop.com
తెలుగు సింగర్స్ కోసం స్పెషల్ గా ఆహా ఓటీటీ తెలుగు ఇండియన్ ఐడల్ షోని చేసిన విషయం తెలిసిందే.
సీజన్ 1 సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకోగా ఇప్పుడు ఆ షో సీజన్ 2 కి రంగం సిద్ధం చేస్తున్నారు.
ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 1 లో జడ్జులుగా థమన్, నిత్యా మీనన్, కార్తిక్ లు ఉన్నారు.
అయితే సీజన్ 2లో కార్తీక్ మాత్రం కొనసాగే అవకాశం ఉన్నా నిత్యా మీనన్, థమన్ కొనసాగే ఛాన్స్ లేదని తెలుస్తుంది.
నిత్యా మీనన్ రీసెంట్ గా తన కెరియర్ కు కొన్నాళ్లు ఫుల్ స్టాప్ పెడుతున్నా అని షాక్ ఇచ్చింది.
దాదాపు ఇండియన్ ఐడల్ తెలుగు షో జడ్జ్ గా కూడా చేసే అవకాశం లేదు.
ఇక మరోపక్క వరుస సినిమాలతో సూపర్ బిజీగా ఉన్న థమన్ ఇప్పటికే చేతినిండా సినిమాలతో సత్తా చాటుతున్నాడు.
ఇంత బిజీ షెడ్యూల్ లో ఆయన ఈ షోకి జడ్జ్ గా వ్యవహరించే అవకాశం ఉండదు.
అయితే ఆయన ప్లేస్ లో తెలుగు మ్యూజిక్ డైరక్టర్ ఎం.ఎం కీరవాణి లేదా మణిశర్మ గాని తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 లో జడ్జ్ గా వస్తారని టాక్.
ఇండియన్ ఐడల్ లో కొత్త సింగర్స్ తమ టాలెంట్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.
కేవలం ఆడియెన్స్ ఓటింగ్ ద్వారా మాత్రమే వారి గెలిపించడం జరుగుతుంది.ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1లో వాగ్దేవి విజేతగా నిలిచింది.
ఆమె గాత్రమే కదు అందంతో కూడా ఆడియెన్స్ ని అలరించింది.ఇండియన్ ఐడల్ లో టాప్ 5 కంటెస్టంట్స్ అందరికి సినిమాల్లో పాడే అవకాశం ఇస్తున్నారు.
ఆల్రెడీ వారికి ఇప్పటికే మంచి క్రేజ్ ఏర్పడింది.ఇక సీజన్ 2 కోసం ఆడియెన్స్ కూడా ఎంతో ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు.
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 సరికొత్త హంగులతో ఉండబోతుందని తెలుస్తుంది.మరి సీజన్ 2 లో ఎన్ని సర్ ప్రైజెస్ ఉంటాయో చూడాలి.
అద్భుతం, అడవి జంతువుకు దైవభక్తా.. శివలింగాన్ని హత్తుకున్న ఎలుగుబంటి వీడియో వైరల్!