డాక్టర్ గోలి మోహన్ ను అభినందించిన ఒమన్ (మస్కట్)అగ్రికల్చర్ మినిస్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా: హైదరాబాదులో జరుగుతున్న ప్రపంచ ఐటీ మహాసభలకు హాజరైన డాక్టర్ గోలి మోహన్ డాక్టర్ సౌదీ బిన్ అల్లాబీస్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్.

సుల్తానా ఆఫ్ ఒమన్ మస్కట్ అగ్రికల్చర్ మినిస్టర్ హల్మదాన్ హల్కి.ప్రపంచ తెలుగు ఐటి మహా సభలకు ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ గోలి మోహన్ మాట్లాడుతూ యువత సరైన సమయాన్ని అద్భుతాలు సృష్టించే విధంగా ఇన్నోవేషన్ థాట్స్ తో ముందుకు వెళితే అద్భుతాలు సృష్టించవచ్చని అన్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయ రంగంలో నూతన ఇన్నోవేషన్ థాట్స్ అవసరమని దానికి తగినట్లుగా రైతులు ప్రతిఫలం పొందుతారని యువత ఇటువంటి నూతన ఆలోచనల ద్వారా మన దేశానికి కానీ రాష్ట్రానికి గాని ఇన్వెస్టర్స్ ముందుకు వస్తారని తద్వారా రైతులకు లాభం చేకూరుతుందని అన్నారు.

భారతదేశానికి వ్యవసాయ రంగం ప్రధాన ఆదాయ వనరు అని తద్వారా అద్భుతాలు సృష్టించవచ్చని అన్నారు.

అనంతరం మస్కట్ అగ్రికల్చర్ మినిస్టర్ అలాందా హల్కి మాట్లాడుతూ తెలంగాణలో నూతనంగా ప్రయోగిస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న కినోవా సీడ్స్ ను ఎగుమతి చేస్తే మేము కూడా మా దేశంలో వ్యవసాయ రంగంలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు తోడ్పాటు అవుతుందని అంతర్జాతీయ వేదిక ద్వారా డాక్టర్ గోలి మోహన్ ని కోరడం జరిగిందని దానికి తగినట్లు డాక్టర్ గోలి మోహన్ స్పందించి సహకరిస్తానని తెలిపారు.

మస్కట్ అగ్రికల్చర్ మినిస్టర్ హల్కి డాక్టర్ గోలి మోహన్ కి కృతజ్ఞతలు తెలిపారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు26, సోమవారం 2024