పంటపొలాల్లో కలుపు తీయడానికి రోబోలు?

ఈ ప్రపంచంలో ఏ దేశానికైనా రైతే వెన్నుముక.అందుకే మనవాళ్ళు రైతే రాజు అని అంటూ వుంటారు.

అవును, రైతులు( Farmers ) సుభిక్షంగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది.ఇక మన దేశంలో పంట పొలాల్లో పుడుతున్న కలుపు ( Weeds ) కారణంగా రైతులకు ఏటా రూ.

1980 కోట్లమేర ఆర్థిక నష్టం జరుగుతుందని సమాచారం.పురుగులు, తెగుళ్ల నష్టాలకన్నా కలుపు నష్టమే ఎక్కువని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి తాజాగా ఓ సర్వేలో చెప్పుకొచ్చింది.

ఇక ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని మనవాళ్ళు టెక్నాలజీపైన ఆధారపడడం మొదలు పెట్టారు.

"""/" / ఈ క్రమంలోనే ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో భాగంగా స్వతంత్రంగా పనిచేస్తూ కలుపు మొక్కల్ని మాత్రమే నిర్మూలించే రోబోలు( Robots ) మార్కెట్లోకి వస్తున్నట్టు తెలుస్తోంది.

జీపీఎస్, జిఐఎస్‌, కృత్రిమ మేధ వంటి అత్యాధునిక సాంకేతికతలతో రూపొందిన 'రోబో కూలీలు'గా వీటిని పేర్కొంటున్నారు.

ఇక వీటిల్లో అనేక రకాలున్నాయి.కలుపు తీసే రోబో తనను తానే నడుపుకుంటూ పంట సాళ్లలో వెళ్తూ సాళ్ల మధ్యన, వరుసల్లో మొక్కలు/చెట్ల మధ్యన ఉండే నిర్దేశించిన కలుపు మొక్కల్ని మాత్రమే గుర్తించి నాశనం చేస్తాయి.

అయితే ఇక్కడ నాశనం చేసే పద్ధతులు అనేకం ఉన్నాయి. """/" / పంట మొక్కలు, చెట్లకు హాని జరగకుండా.

గాలి, మంట (ఫ్లేమ్‌), మైక్రోవేవ్స్, చలి గాలి, లేజర్‌ కిరణాలు, వాటర్‌ జెట్‌ను ప్రయోగించటం ద్వారా కేవలం కలుపు మొక్కల్ని నిర్మూలించటం ఈ రోబోల ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు.

అయితే వీటిని కొనాలంటే కాస్త డబ్బులు ఎక్కువ వెచ్చించాలి.ఇక వీటి నిర్వహణకు నైపుణ్యం కలిగిన పనివారి అవసరం ఉంటుంది.

కూలీల సమస్యను అధిగమించే క్రమంలో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల ద్వారా డ్రోన్ల మాదిరిగా వీటిని మన దేశంలో కూడా వీటిని త్వరలో వినియోగించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

అఖండ సీక్వెల్ లో బాలయ్య పాత్ర ఇదే.. బాలయ్య నట విశ్వరూపం చూడబోతున్నామా?