బీజేపీ పై భారీగానే దెబ్బేసిన వ్యవసాయ చట్టాలు.. ఫాంలోకి కాంగ్రెస్.. ?

కేంద్రంలో తిరుగులేని పార్టీగా చలామని అవుతున్న బీజేపీ ఇంతకాలం ఎలాంటి అడ్డులేకుంటా దూసుకుపోతుంది.

అయితే తాజాగా పంజాబ్ నగరపాలక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూట గట్టుకుందట.

మోడీ పధకాలు దేశంలో లక్ష్మి బాంబుల్లా పేలుతున్నాయి అని అనుకుంటున్న సమయంలో గత కొన్ని నెలలుగా రైతులు చేస్తున్న వ్యవసాయ చట్టాల ఉద్యమం బీజేపీపై భారీగానే పడిందని తెలుస్తుంది.

ఇకపోతే కాంగ్రెస్ ఏడు మున్సిపల్ కార్పొరేషన్లను క్లీన్ స్వీప్ చేసింది.మోగా, హోషియార్ పూర్, కపుర్తలా, అబోహర్, పఠాన్ కోట్, బాటాలా, బఠిండాల్లో హస్తం జయకేతనం ఎగురవేసింది.

కాగా మొహాలీకి సంబంధించి రేపు ఫలితాలను ప్రకటించనున్నారు.ఇక్కడ మరో విశేషం ఏంటంటే 53 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ గెలుపు జెండా బఠిండా మున్సిపల్ కార్పొరేషన్లో ఎగరడం విశేషం.

"""/"/ మరి ఈ ఫలితాలను చూస్తే బీజేపీ కమళం వాడిపోవడానికి ఎంతో సమయం లేదని అర్ధం అవుతుందట.

ఇప్పటికైన మోడీ ప్రభుత్వం పెదల కన్నీళ్లు తాగడం ఆపి, రైతులకు అండగా ఉంటే మరి కొన్ని సంవత్సరాల పాటు అధికారంలో ఉంటుంది.

లేదంటే బీజేపీకీ ఇదే చివరి అవకాశం అని అనుకుంటున్నారట ఈ ఫలితాలను చూసిన వారు.

సిక్కు ఎన్జీవో సంస్ధ పెద్ద మనసు .. అమెరికా వ్యాప్తంగా ఏకంగా 10 వేల మందికి భోజనం