గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు కీలకం..

సూర్యాపేట జిల్లా:గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు కీలకపాత్ర పోషిస్తాయని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య( Bollam Mallaiah Yadav ) యాదవ్ అన్నారు.

బుధవారం మునగాల మండలం పరిధిలోని కొక్కిరేణిలో నూతనంగా ఏర్పాటు చేసిన పౌల్ట్రీ ఫామ్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోళ్లను పూర్వకాలం నుండి రైతులు( Farmers ) వ్యవసాయానికి అనుబంధంగా పెంచుకుంటూ వస్తున్నారన్నారు.

స్వయం ఉపాధి పథకాల ద్వారా గ్రామీణ నిరుద్యోగిత తగ్గడంతో పాటు కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అయితాయన్నారు.

తెలంగాణ ప్రభుత్వం పౌల్ట్రీ ఫారాల ఏర్పాటుకు డైరీ ఫారంలో ఏర్పాటుకు రుణాలు అందజేస్తుందని, స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకునే వారికి తన వంతు సహకారం అందిస్తానన్నారు.

పౌల్ట్రీ ఫారం యజమాని ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు,కట్ట సతీష్ కుమార్( Katta Satish Kumar ),దుర్గారావు, శంభయ్య,వెంకన్న,వెంకట రామయ్య,సర్పంచ్ రాజు, బ్రహ్మం,నందిగామ సైదులు,వెంకట్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి,రామకృష్ణ రెడ్డి,నరేష్ తదితరులు పాల్గొన్నారు.

లేటు వయసులో గర్భం దాల్చిన హీరోయిన్స్ ఎవరంటే ?