వైరల్: ప్రేమించినోడితో పోయింది.. ఆస్తి కోసం కూతురు చేసింది ఇదే!
TeluguStop.com
ఒక్కగానొక్క కూతురిని( Daughter ) కంటికి రెప్పలా చూసుకొని అల్లారి ముద్దుగా పెంచారు ఆ తల్లిదండ్రులు.
ఆమె అభ్యున్నతి కొరకు పెద్ద పెద్ద చదువులు కూడా చదించారు.తీరా వయసుకు వచ్చాక.
పేరెంట్స్‌కు( Parents ) చెప్పకుండా.ఆమె తనకి నచ్చినోడిని పెళ్లి చేసుకుని ఇంట్లోంచి చెప్పాపెట్టకుండా పారిపోయింది.
ఇక చేసేదేమిలేక ఆ వృద్ధ దంపతులు.బతుకుజీవుడా అని తమ బతుకిని ఏడుస్తున్నారు.
అయితే బాధ్యతా రాహిత్యంగా తెగతెంపులు తెంచుకుని ఇంట్లోంచి వెళ్లిపోయిన ఆ కూతురు.ఇప్పుడు వృద్ధ తల్లిదండ్రులపై పగ పెంచుకొని ఆస్తి( Property ) కోసం కన్న తల్లిదండ్రులనే చంపేందుకు ప్లాన్ వేసింది.
ఈ క్రమంలో కొన్ని నెలల నుంచి వారిని టార్చర్ చేస్తోంది.ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో చిక్కగా ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
"""/" /
విషయం ఏమిటంటే, ఆగ్రాకు( Agra ) చెందిన సురేఖ కుమారి( Surekha Kumari ) అనే మహిళ.
ప్రేమించిన ప్రియుడితో వెళ్ళిపోయింది.ఆ తరువాత తన తల్లిదండ్రుల ఆస్తిపై కన్నేసింది.
ఈ క్రమంలో వృద్ధ తల్లిదండ్రులు అన్న జ్ఞానం లేకుండా వారిపై దాడులకు తెగబడింది.
రోజూ స్కూటీపై ఇటుకలు, రాళ్లు తీసుకొచ్చి.కన్న తల్లిదండ్రులు నివసిస్తున్న ఇంటిపై దాడులు చేస్తోంది.
ఇలా నెలల నుంచి దాడులు చేయగా కిటికీ అద్దాలు.పూలకుండీలు, ఫర్నీచర్ ధ్వంసం అయ్యాయి.
ఇలా ప్రతిరోజూ దాడులు చేయడంతో ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయింది.
"""/" /
ఇందుకు సంబంధించిన దృశ్యాలను బాధిత కుటుంబం సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఈ నేపథ్యంలో పోలీసులు కూడా తమని పట్టించుకోవడం లేదని వృద్ధ తల్లిదండ్రులు వాపోయారు.
కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఈ క్రమంలోనే దాడులకు తెగబడుతున్న ఆ మహిళకు ఆస్తి ఇవ్వొద్దని, వృద్ధ దంపతులపై దాడులు చేస్తున్న మహిళపై పోలీసులు తక్షణం చర్యలు తీసుకోవాలని కామెంట్స్ చేసారు.
దాంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు, ప్రస్తుతం దర్యాప్తు కూడా కొనసాగుతుందని వెల్లడించారు.
ఆగ్రాలోని జగదీష్‌పురాలో ఈ ఘటన చోటుచేసుకుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
వీడియో: పాడుబడిన ఇంట్లో వెతుకుతుంటే ఊహించని ట్విస్ట్.. గోడల్లో నిధి చూసి షాక్!