గాంధీభవన్ లో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ నేతల ఆందోళన
TeluguStop.com
హైదరాబాద్ లోని గాంధీభవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ లో ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
ఈ మేరకు నాగం జనార్ధన్ రెడ్డికి నాగర్ కర్నూల్ నియోజకవర్గ టికెట్ ను కేటాయించాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అడ్డుకునేందుకు నాగం జనార్థన్ రెడ్డి వర్గీయులు ప్రయత్నించారు.
అనంతరం నాగర్ కర్నూల్ టికెట్ నాగంకు ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
మన దర్శకులతో ఇతర భాషల హీరోలు సినిమాలు చేయాలనుకోవడానికి కారణం ఏంటంటే..?