నారింజ అరటి తొక్కల పొడితో వృద్ధాప్య లక్షణాలు దూరం..

నారింజ తొక్క పొడి తో వృద్ధాప్య లక్షణాలను దూరం చేసుకోవచ్చు.అయితే నారింజ తొక్కపొడితో ఇదే కాకుండా ఎన్నో రకాల చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు.

నారింజ తొక్కపొడితో ఆ సమస్యలన్నీ ఎలా దూరం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.నారింజ తొక్కపొడి కంటే ముందు అరటి పండ్లు యాంటీ ఆక్సిడెంట్లు మరియు పొటాషియం లకు గొప్ప మూలమని కచ్చితంగా చెప్పవచ్చు.

ఎందుకంటే అరటిపండు పొడిబారిన చర్మాన్ని సహజంగా మెరిసేలా చేస్తాయి.ఇక ఆలివ్ నూనె చర్మానికి చాలా మంచిది.

"""/"/ ఈ రెండిటిని కలిపి పొడి చర్మం కోసం ఒక గొప్ప ఫేస్ ప్యాక్ తయారు చేయవచ్చు.

ఇందుకోసం ఒక పండిన అరటి తొక్క తీసి గుజ్జు చేయాలి.మెత్తని అరటిపండు పేస్టులో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని శుభ్రమైన ముఖం మీద అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచడం మంచిది.

ఒక నెలపాటు వారానికి రెండు నుంచి మూడు సార్లు ఇలా చేయడం వల్ల చర్మానికి ఎంతో మంచిది.

"""/"/ ఆరెంజ్ తొక్కపొడి ఫేస్ ప్యాక్ డ్రై స్కిన్ కోసం ఎంతో మెరుగ్గా పనిచేస్తుంది.

ఇది చర్మం యొక్క సహజ ప్రకాశాన్ని మరియు మెరుపును పెంచడంలో ఎంతగానో సాయపడుతుంది.

ఆరెంజ్ తొక్కలో ఉండే ఆస్ట్రింజెంట్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు హానికరమైన ఫ్రీడ్ ఆడికల్స్ తో పోరాడడానికి ఉపయోగపడతాయి.

తద్వారా ముఖం పై ముడతలు వంటి ముందస్తు సంకేతాలను నివారించవచ్చు.ఇందులోని విటమిన్ సి చర్మానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.

అంతేకాకుండా యాంటీ మైక్రో బయల్ లక్షణాలు మొటిమలను నివారించడంలో సహాయపడతాయి.మెరిసే చర్మం కోసం ముందుగా ఎండబట్టిన నారింజ తొక్కను దంచి పొడి చేసుకోవాలి.

ఆ పొడిలో పెరుగు సహజ పరిమాణంలో కలుపుకొని ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవడం మంచిది.

ఇలా మూడు నెలలపాటు వారానికి రెండు నుంచి మూడుసార్లు చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.