దూకుడు పెంచిన వైసిపి: తూర్పుగోదావరి అభ్యర్థులు ఖరారు

అధికార వైసిపి దూకుడు పెంచింది సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగానే అభ్యర్థుల ఖరారు మొదలుపెట్టింది.ఆఖరి నిమిషంలో అభ్యర్థులు ఎన్నిక వల్ల జరిగే అవకతవకలకు చోటు ఇవ్వకూడదని భావిస్తున్నట్టుంది .2019 ఎలక్షన్స్ లో లాగానే గోదావరి జిల్లాలో అత్యధిక స్థానాల గెలుపు పై గురిపెట్టింది.రామచంద్రాపురం పెద్దాపురం స్థానాలకు అభ్యర్థుల్ని గోదావరి జిల్లాల వైసీపీ ఇన్చార్జ్ మిథున్ రెడ్డి ప్రకటించారు.రామచంద్రాపురం నుండి చెల్లుబోయిన వేణుకు మరొకసారి అవకాశం దక్కగా, పెద్దాపురం నుండి నియోజకవర్గ ఇన్చార్జ్ దవులూరి దొరబాబు పోటీ చేయనున్నారు.చెల్లుబోయిన వేణు ఇప్పటికే మంత్రిగా ఉన్నారు .గత ఎన్నికలలో మొదటిసారి గెలిచినప్పటికీ మంత్రి పదవిని దక్కించుకున్న వేణు, నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసి ప్రజల్లో పేరు తెచ్చుకున్నారు.

ఆయన విజయ అవకాశాలపై రిపోర్ట్ తెచ్చుకున్న అధిష్టానం మరొకసారి సీట్ కన్ఫర్మ్ చేసింది. పెద్దాపురం నుండి దొరబాబుకి గత ఎన్నికలలోనే టికెట్ ఇవ్వాలనుకున్నప్పటికీ మారిన సమీకరణాల రీత్యా చివరి నిమిషంలో పార్టీలోకి చేరిన తోట నరసింహం సతీమణికి ఇవ్వాల్సి వచ్చింది.ఆవిడ తన సమీప ప్రత్యర్థి నిమ్మకాయల చిన్న రాజప్ప చేతిలో ఓటమి పాలయ్యారు .ఈసారి దొరబాబుకి సంవత్సరం ముందే టికెట్ కన్ఫర్మ్ చేయడం ద్వారా లెక్కలు సరిచేసినట్లుగా భావించవచ్చు.దొరబాబు ప్రత్యర్ధులైన తోట త్రిమూర్తులు పిల్లి సుభాష్ చంద్రబోస్ కు కూడా వైసిపి అధిష్టానంఒక క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది .

అంతేకాకుండా కోనసీమ జిల్లా కి అంబేద్కర్ కోనసీమ జిల్లా గా పేరు మార్చినప్పుడు జరిగిన అల్లర్లలో టిడిపి నాయకులతో పాటు కొంతమంది వైసీపీ నాయకులపై కూడా కేసులు పెట్టడం జరిగింది.ఆ సంఘటనలో వైసిపి ప్రభుత్వం కొంత వ్యతిరేకత కూడా మూటగట్టుకుంది.ఎన్నికల సమిపిస్తున్నందున ఆ వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నం చేయాలనుకుంటున్న ప్రభుత్వం ఆ కేసులను ఎత్తివేసే దిశగా ఆలోచన చేస్తుంది .అసెంబ్లీ ఎన్నికలు మొదలయ్యే లోగా ఆ కేసులన్నిటిని ఎత్తేస్తామని ఉపయోగ గోదావరి జిల్లాల వైసిపి ఇన్చార్జ్ మిథున్ రెడ్డి తెలిపారు ఇది కేవలం ఎన్నికలు ని దృష్టిలో పెట్టుకొని చేసిన చర్యగా చాలామంది భావిస్తున్నారు.మరి దీని ఫలితం ఎలా ఉంటుందో రానున్న ఎన్నికల్లో తెలుస్తుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీని రేవంత్ టార్గెట్ చేశారా.. నిన్న నాగార్జున నేడు బన్నీ.. ఎక్కడ చెడింది?