ఏజెంట్ యూఎస్ఏ రివ్యూ…

అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ఏజెంట్( Agent ) .

మరికొద్ది గంటల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా తెలుగు , మలయాళం బాషలలో ఘనంగా విడుదల అవబోతుంది .

ఇక ఈ సినిమాపై అక్కినేని అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు వారి అంచనాలకు తగ్గట్టే ట్రైలర్ ఆకట్టుకుంది ఇక ఈ సినిమా ప్రీమియర్స్ ఇప్పటికే అమెరికాలో పడిపోయాయి మరి ఈ సినిమాకు అక్కడ ఎలాంటి టాక్ వచ్చింది .

అఖిల్ ఈ మూవీ ద్వారా విజయాన్ని అందుకున్నాడా లేదా అనేది యుఎస్ ఆడియెన్స్ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

"""/" / సురేందర్‌ రెడ్డి( Surender Reddy ) దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా నటించిన స్పై యాక్షన్‌ ఫిల్మ్‌ ఈ ఏజెంట్‌ చిత్రం .

ఇందులో మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు.సాక్షివైద్య హీరోయిన్‌గా నటించింది.

ఇక ఈ సినిమా చూసిన యుఎస్ ఆడియెన్స్ సినిమా పట్ల పాజిటివ్ గా స్పందిస్తున్నారు .

డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ చిత్రం తో తన మార్కు ఏంటో చూపించాడని, మంచి యాక్షన్ ఎంటర్టైనర్ ని ఆడియన్స్ కి అందించాడని, సమ్మర్ సీజన్ కనుక ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

అంతేకాదు ఇటీవలి కాలంలో ఇంత కిక్ ఇచ్చే సినిమాని చూడలేదని, సినిమా మొత్తం స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉందని చెబుతున్నా రు ఇక ఈ సినిమాకి అన్ని వర్గాల నుంచి ఇదే స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది .

అఖిల్ తన కెరీర్ లో ఎప్పటినుండో కోరుకుంటున్న గ్రాండ్ హిట్ తగిలినట్లేనని అంటున్నారు.

"""/" / ఓ మిషన్‌ కోసం మమ్ముట్టి టీమ్‌ అఖిల్‌ని రంగంలోకి దించడం.

తనకి అప్పగించిన బాధ్యతలని ఏజెంట్ అఖిల్ పూర్తి చేసే క్రమంలో వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయని చెబుతున్నారు .

కోతిలాంటి బిహేవియర్‌ ఉన్న అఖిల్‌ ఏజెంట్‌గా మారతాడని.ఒకానొక దశలో అఖిల్‌నే చంపేయాలని మమ్ముట్టి( Mammootty ) తన టీమ్‌ సభ్యులను ఆదేశిస్తాడని.

ఆ సీన్స్ గూస్ బమ్బ్స్ తెప్పిస్తాయని చెబుతున్నారు.మిషన్‌ని పూర్తి చేసే క్రమంలో అఖిల్‌కు ఎదురైన సవాళ్లు .

ఆ క్రమంలో వచ్చే యాక్షన్ సీన్స్ సూపర్ అని అంటున్నారు .స్పై యాక్షన్‌ ఫిల్మ్స్‌ లో ఉండవలసిన గన్‌తో బుల్లెట్ల వర్షం కురిపించడం, అదిరిపోయే స్టంట్స్‌ ఇందులో ఓ రేంజ్ లో ఉన్నాయని సినిమా చూసిన ఆడియెన్స్ చెబుతున్నారు .

"""/" / ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడని సినిమ చూస్తే అర్ధమవుతుందని.

ఆయనకి హిట్ అందించేలా సినిమా ఉందన్న టాక్ బలంగా వినిపిస్తుంది.హిప్‌ హాప్‌ తమిళ్‌ మ్యూజిక్‌ ఆకట్టుకుంది.

సినిమాకు భారీ ఖర్చు చేశారని అది ప్రతి ఫ్రెములో కనిపిస్తుందనేది యుఎస్ ఆడియెన్స్ ( US Audience )మాట చూసిన ప్రతీ ఒక్కరు ఒక మంచి యాక్షన్ సినిమాని చూసిన అనుభూతి కలిగింది అంటూ చెప్పుకొస్తున్నారు టాలీవుడ్ లో ఏజెంట్ ఓ రేంజ్ సెన్సేషన్ సృష్టిస్తుందని అంటున్నారు .

అఖిల్ కూడా తన నటనని చాలా మెరుగుపర్చుకున్నాడని, ఈ సినిమా తర్వాత ఆయన స్టార్ లీగ్ లోకి అడుగుపెట్టడం ఖాయమని అంటున్నారు.

డై రెక్టర్ సురేందర్ రెడ్డి తనలోని టాలెంట్ ని మరోసారి అందరికీ పరిచయం చేసాడని, సమ్మర్ లో సరైన బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న మూవీ లవర్స్ కి ఏజెంట్ చిత్రం ఒక పండుగ లాగా ఉంటుందని పేర్కొంటున్నారు .

పుష్ప ది రూల్ మూవీలో శ్రీలీలకు ఛాన్స్.. జానీకి బదులుగా ఆ కొరియోగ్రాఫర్ కు ఛాన్స్ దక్కిందా?