అప్పుడు లైగర్ ఇప్పుడు ఏజెంట్.. సురేందర్ రెడ్డి డబ్బులు వెనక్కిస్తారా?

ఒక భారీ బడ్జెట్ సినిమా ఫ్లాప్ అయితే ఆ ప్రభావం ఎంతమందిపై ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

లైగర్( Liger ) సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమా మిగిల్చిన నష్టాల భారం వల్ల పూరీ జగన్నాథ్( Puri Jagannath ) కెరీర్ ప్రమాదంలో పడింది.

కొంతమంది స్టార్ హీరోలు పూరీ జగన్నాథ్ తో సినిమా అంటే రిస్క్ అని ఫీలయ్యే పరిస్థితి ఏర్పడింది.

లైగ సినిమాకు పూరీ నిర్మాతగా కూడా వ్యవహరించారు.లైగర్ మిగిల్చిన నష్టాల వల్ల ఎంతోమంది ఎగ్జిబిటర్లు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు అప్పులపాలయ్యారు.

ప్రస్తుతం ఏజెంట్ సినిమా( Agent Movie ) పరిస్థితి కూడా అదే విధంగా ఉందని సమాచారం అందుతోంది.

ఈ సినిమాకు మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ రావడంతో ఫస్ట్ వీకెండ్ లో కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు అయితే రాలేదు.

అయితే ఇప్పుడు ఏజెంట్ సినిమాకు కూడా అదే తరహా పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది.

"""/" / ఈ సినిమా నిర్మాణంలో సురేందర్ రెడ్డి ( Surender Reddy )కూడా నిర్మాణ భాగస్వామి కావడంతో ఈ సినిమా నష్టాల భారం ఆయనపై ఉందని తెలుస్తోంది.

అయితే సురేందర్ రెడ్డి కొంత మొత్తాన్ని వెనక్కిస్తారా? లేక ఈ వివాదం విషయంలో సైలెంట్ అవుతారా? చుడాలి.

అఖిల్ ఏజెంట్ సినిమా కోసం ఒక్క రూపాయి రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు.అందువల్ల అఖిల్ కు నష్టాలలో ఎలాంటి బాధ్యత ఉండదు.

"""/" / ఏజెంట్ సినిమా హక్కులను కొన్న డిస్ట్రిబ్యూటర్ కెరీర్ ను ఈ సినిమా దారుణంగా ముంచేసింది.

ఏజెంట్ నష్టాలను నిర్మాత అనిల్ సుంకర మాత్రం కొంతమేర భర్తీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఏజెంట్ సినిమా ఫ్లాప్ కావడంతో సురేందర్ రెడ్డికి ఆఫర్లు ఇచ్చేవాళ్లు సైతం కరువయ్యారని సమాచారం అందుతోంది.

సురేందర్ రెడ్డికి ఏ హీరో ఛాన్స్ ఇస్తారో చూడాల్సి ఉంది.

నాగార్జునతో ప్రతి ఒక్కరు ప్రేమలో పడతారు.. కుష్బూ సంచలన వ్యాఖ్యలు!