ముసలితనం లో గాత్రధర్మం – సీనియర్స్ అయితేనేమి అవార్డ్స్ కి కొదవలేదు
TeluguStop.com
గాత్రం.ఇది దేవుడు ఇచ్చిన వరం.
అందరికి అది రాదు.అందుకే సింగర్స్ తమ గొంతును కాపాడుకోవడానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.
అయితే చిన్న వయసులో పర్వాలేదు.40 పోయి 50, 60 వచ్చిందట గొంతులో వయసు పరంగా వచ్చే మార్పులు తప్పకుండ వస్తాయి.
ఈ విషయాన్నీ ఒప్పుకోకపోయినా అందరికి తెలుసు.ఒక ఇంటర్వ్యూ లో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జానకమ్మ అప్పుడు ఎలా పాడారో ఇప్పుడు అలాగే పాడుతున్నారు, లతా మంగేష్ఖర్ గొంతు 20 లలో ఉన్నట్టే 60 లలో ఉంది అంటే ఖచ్చితంగా ఒప్పుకోను అన్నారు.
తనకు సైతం వయసు అయిపోయిందంటూ ఒప్పుకునే అతి తక్కువ మంది వ్యక్తులలో బాలు కూడా ఒకరు.
కానీ కొంత మంది వయసు పెరిగిన కూడా అవార్డ్స్ కి ఏమాత్రం కొదవ ఉండదు.
సాధారణ ప్రేక్షకులు అయితే పెద్దగా గుర్తు పట్టరు కానీ పాటల ప్రేమికులు, సంగీత దర్శకులు వయసు అయిపోయిన గాత్రాన్ని యిట్టె గుర్తు పట్టేస్తారు.
ఆలా వయసు పెరిగిన కూడా చాల మంది మంచి పాటలు పాడిన గాయకులు ఎవరో ఒకసారి చూద్దాం.
లేకిన్ అనే హిందీ మూవీ లో లతా మంగేష్కర్ పాటలు పాడినప్పుడు ఆమె వయసు 61.
అయినా కూడా ఈ సినిమాకు ఉత్తమ జాతీయ గాయని గా ఆమె అవార్డు అందుకుంది.
ఇక ఎస్ జానకమ్మ దేవర్ మగన్ అనే సినిమా కోసం పాటలు పాడినప్పుడు ఆమె వయసు 55.
ఆ సినిమా లో పాడిన పాటలకు గాను నాలుగో సారి జాతీయ ఉత్తమ గాయని గా ఆమె ఎంపిక అయ్యింది.
"""/"/
ఇంత పెద్ద వయసుకు జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న గాయని మణులు ఈ ఇద్దరే కావడం విశేషం.
అయితే ఇంతకు ముందు వరకు సీనియర్ గాయకులు 40 ఏళ్ళు రాగానే పాటలు పడటం తగ్గించేవారు.
కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది.పి సుశీల వంటి గాయని ఆమె 60 ఏళ్ళ వయసులోనూ ఎంతో అద్భుతంగా పాటలు పాడారు.
ఆ వయసులో కూడా ఆమె అనేక నంది అవార్డ్స్ గెలుచుకున్నారు.ఇక 80 వ ఏటా పాట రికార్డు చేసిన ఘనత కూడా ఆమెకే దక్కింది.
పన్నాడి అనే తమిళ సినిమా కోసం జానకమ్మ పాట పాడారు.ఇక జామున రాణి సైతం మిథునం సినిమాలో 74 ఏటా పాట పాడారు.
వైరల్ వీడియో: ఇలా ఉన్నరేంట్రా.. థియేటర్‌లో ఉచిత పాప్‌కార్న్ ఇవ్వడంతో ఏకంగా?