నరేష్ కు రమ్య రఘుపతికి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

సీనియర్ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

నరేష్ 1963 సంవత్సరంలో జన్మించారని నేను 1982 సంవత్సరంలో జన్మించానని తెలిపారు.ఇద్దరి మధ్య దాదాపుగా 20 సంవత్సరాల గ్యాప్ ఉందని రమ్య రఘుపతి తెలిపారు.

నా వయస్సు కంటే 12 సంవత్సరాలు వయస్సు తక్కువని చెప్పి సీనియర్ నరేష్ పెళ్లి చేసుకున్నాడని ఆమె తెలిపారు.

పెళ్లికి ముందే నిజం తెలిసిందని నన్ను మిస్ అయిపోతానని చెప్పి పెళ్లి చేసుకున్నాడని రమ్య రఘుపతి పేర్కొన్నారు.

నరేష్ వేణుస్వామికి జాతకం చూపించగా ఆయన ఈ మ్యారేజ్ సెట్ కాదని చెప్పారని ఆమె కామెంట్లు చేశారు.

498ఏ కేసు పెట్టాలని మా లాయర్ సూచించారని రమ్య రఘుపతి తెలిపారు.సోషల్ మీడియాలో చెబుతున్నట్టు తాను భరణం తీసుకున్నట్టు జరిగిన ప్రచారంలో నిజం లేదని రమ్య రఘుపతి అన్నారు.

పెళ్లైన ఏడాది తర్వాత నరేష్ కు నాకు బాబు పుట్టాడని ఆమె తెలిపారు.

నరేష్ కు రఘువీరారెడ్డి గారి నుంచి ఎలాంటి సపోర్ట్ రాలేదని రమ్య కామెంట్లు చేశారు.

పెళ్లికి ముందు నరేష్ లేచిపోదామని చెప్పారని లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉందామని నరేష్ కోరగా నేను ఒప్పుకోలేదని రమ్య వెల్లడించడం గమనార్హం.

బెంగళూరులో మా పెళ్లి జరిగిందని రమ్య రఘుపతి కామెంట్లు చేయడం గమనార్హం. """/"/ 20 సంవత్సరాల జీవితం ఇస్తానని మాటిచ్చి నరేష్ పెళ్లి చేసుకున్నాడని ఆయన మాటలు నచ్చి నేను అంగీకరించానని రమ్య రఘుపతి తెలిపారు.

విజయనిర్మల నాతో ఎంత కష్టం వచ్చినా ముఖంపై చూపించొద్దని చెప్పేవారని రమ్య రఘుపతి కామెంట్లు చేశారు.

విజయనిర్మల గారు ఆవిడకు ఉన్న బాధను కూడా ఎవరికీ చెప్పుకునేవారు కాదని రమ్య రఘుపతి కామెంట్లు చేశారు.

రమ్య రఘుపతి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ మధ్యకాలంలో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల అవకుండా ఆగిపోయిన సినిమాలు..!