తల్లి పాత్రలో నటించిన శృతి మరాఠే వయస్సు ఎన్టీఆర్ కంటే తక్కువా.. ఏజ్ గ్యాప్ ఎంటే?

దేవర సినిమా( Devara Movie )లో తారక్ దేవర, వర పాత్రల్లో నటించి రెండు పాత్రల్లో మెప్పించారు.

వాస్తవానికి లీక్స్ ద్వారా ఈ సినిమా కథ, కథనానికి సంబంధించిన ఎన్నో విషయాలు సినిమా రిలీజ్ కు ముందే వెల్లడి కావడంతో సినిమా చూస్తున్న సమయంలో ప్రేక్షకులకు కొంతమేర ఆసక్తి తగ్గింది.

దేవర మూవీని రెండు భాగాలుగా తెరకెక్కించకుండా ఒకే పార్ట్ లో ముగించి ఉంటే బాగుండేదని చాలామంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

"""/" / అయితే దేవర సినిమాలో దేవర భార్య పాత్రలో శృతి మరాఠే( Shruti Marathe ) అనే నటి నటించారు.

ఈ నటి వయస్సు 37 సంవత్సరాలు కాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ వయస్సు 41 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.

వర పాత్ర, అతని తల్లి పాత్ర మధ్య ఏజ్ గ్యాప్ 4 సంవత్సరాలు అని వర పాత్ర కంటే అతని తల్లి పాత్ర వయస్సు తక్కువ అని తెలిసి నెటిజన్లు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.

మరోవైపు శృతి మరాఠే దేవర సినిమాలో కనిపించింది తక్కువ సీన్లలోనే అయినా ఆమె తన నటనతో ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అయితే అవసరం లేదని చెప్పవచ్చు.

శృతి మరాఠే రెమ్యునరేషన్ ఒకింత పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది.శృతి మరాఠే కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.

"""/" / శృతి మరాఠే తెలుగులో ఆఫర్లు వస్తే ఎలాంటి రోల్స్ ను ఎంచుకుంటారో చూడాల్సి ఉంది.

సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) కు సైతం తెలుగులో ఆఫర్లు ఎక్కువగానే వస్తున్నా ఆయన రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉండటం గమనార్హం.

అందువల్ల సైఫ్ అలీ ఖాన్ కు ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ ఎవరు ఆఫర్ చేస్తారనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి .

అప్పటివరకే నేను చిరంజీవి ఫ్యాన్.. వైరల్ అవుతున్న శ్రీకాంత్ ఓదెల షాకింగ్ కామెంట్స్!