మళ్ళీ ఆ స్టార్ హీరో తోనే సినిమా చేస్తున్న కృష్ణ చైతన్య…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు కృష్ణ చైతన్య( Krishna Chaitanya ).
ఈయన తనదైన రీతిలో సినిమాలను చేసి మంచి గుర్తింపు సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.
ఇక రీసెంట్ గా విశ్వక్ సేన్ ను హీరోగా పెట్టి ఆయన తీసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి( Gangs Of Godavari ) సినిమా ఆవరేజ్ గా ఆడింది.
అయినప్పటికీ వీళ్ళ కాంబినేషన్ కి మాత్రం మంచి గుర్తింపైతే లభించింది.అలాగే కృష్ణ చైతన్య డైరెక్షన్ కూడా చాలా బాగా చేశారు అంటూ ప్రశంసలైతే అందాయి.
మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన తన నెక్స్ట్ సినిమాను ఎవరితో చేయబోతున్నాడనే అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి.
"""/" /
మరి ఇలాంటి క్రమం లోనే ఇంతకుముందు ఆయన నితిన్ తో చల్ మోహనరంగా అనే సినిమా చేశాడు.
ఇక ఆ సినిమా తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో పవర్ పేట అనే సినిమా ఉంటుందని అప్పటీలో వార్తలైతే వచ్చాయి.
కానీ ఆ సినిమా ఇప్పటివరకు కార్య రూపం దాల్చలేదు.ఇక విశ్వక్ సేన్ తో మరొక సినిమా చేయాలని అనుకుంటున్నా ఆయన నితిన్ కోసం తయారు చేసిన స్క్రిప్ట్ తోనే విశ్వక్ సేన్ తో సినిమా చేయబోతున్నట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి.
ఇక అందులో భాగంగానే ఈ సినిమాలో విశ్వక్ సేన్ మూడు గెటప్పుల్లో కనిపించబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి.
ఇక అందులో ఒకటి టీనేజ్ గెటప్ కాగా, మరొకటి యంగేజ్, ఓల్డ్ ఏజ్ గెటప్ లు కావడం విశేషం.
"""/" /
ఇక వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా యావరేజ్ గా ఆడినప్పటికీ మరోసారి విశ్వక్ సేన్ కృష్ణ చైతన్యతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.
ఇక వీళ్ల మద్య మంచి బాండింగ్ అయితే ఉందని ఈ సినిమా సమయంలో వీళ్ళిద్దరూ ఒక్కొక్కరు బాగా దగ్గరయ్యారని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలియజేశారు.
ఇక మొత్తానికైతే వీళ్లు ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాట్టుగా తెలుస్తుంది.
సలార్ సెంటిమెంట్ రిపీట్ కానుందా.. ఆ తేదీకి మంచు విష్ణు కన్నప్ప రిలీజ్ కానుందా?