ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై మధ్యాహ్నం తీర్పు..!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) పిటిషన్ పై ఇవాళ మధ్యాహ్నం తీర్పు వెలువడనుంది.

ఈ మేరకు మధ్యాహ్నం 2 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court ) తీర్పు ఇవ్వనుంది.

ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసులో సీబీఐ విచారణను ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.

కాగా కవితను అరెస్ట్ చేసిన సీబీఐ ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే కవితను సీబీఐ ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరింది.అదేవిధంగా కవితకు వ్యతిరేకంగా ఉన్న వాట్సాప్ చాట్స్ ను కోర్టుకు సీబీఐ సమర్పించింది.

కాగా ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.

బర్త్ డే క్వీన్ నవీన రెడ్డి: మంచి పాత్రలు చేస్తూ ఇండస్ట్రీ లో స్టార్ ఇమేజ్ దక్కించుకున్న నటి…