మూడేళ్ళ తర్వాత పల్లె వెలుగు రాక మురిసిన పల్లెలు

నల్లగొండ జిల్లా:ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం యాచారం హాలియా బస్సు పునరుద్ధరణలో భాగంగా నాగార్జునసాగర్ శాసనసభ్యులు జైవీర్ రెడ్డి ఆర్టీసీ అధికారులతో పలుమార్లు మాట్లాడి ఈ సర్వీస్ ను నడిపే విధంగా కృషి చేశారు.

గత పాలకులు ఆర్టీసీ బస్సు నిలిపివేయడంతో వృద్ధులు,విద్యార్థులు, సామాన్య ప్రజలు,వ్యాపార వర్గాలు జిల్లా,మండల కేంద్రాలకి వెళ్లాలంటే ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు.

అదేవిధంగా మారేపల్లి గ్రామానికి చెందిన హారూన్ అంజద్ అనే హైకోర్టు న్యాయవాది గతనెలలో బస్సు పునరుద్ధరణపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ పై హైకోర్టు స్పందించి హాలియా యాచారం బస్సును వెంటనే పునరుద్దించాలని ఆర్టీసీని ఆదేశించింది.

దీనిపై ఆర్టీసీ అధికారులు సానుకూలంగా స్పందించడంతో హాలియా- యాచారం బస్సును మంగళవారం పునరుద్దించారు.

జిల్లా మండల కేంద్రాలకు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రజలు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.

వైరల్ : అయ్యబాబోయ్.. 3 రోజుల్లో 60 మందిని పెళ్లాడిన మహిళ..