కెనడా నుంచి భారత్‌కు వెళ్లేవారికి ఇండియన్ హైకమీషన్ శుభవార్త.. మూడేళ్ల తర్వాత మళ్లీ సేవలు

ఇమ్మిగ్రేషన్ సేవలకు సంబంధించి కెనడాలోని భారత హైకమీషన్ శుభవార్త చెప్పింది.దాదాపు మూడేళ్ల తర్వాత భారతదేశానికి వెళ్లడానికి డాక్యుమెంటేషన్ కోసం దరఖాస్తుదారులను వాక్ ఇన్ విధానంలో అనుమతించనున్నారు.

ఒట్టావాలోని భారత హైకమీషన్ మంగళవారం ఈ విషయాన్ని ప్రకటించింది.దీని కోసం బీఎల్ఎస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు హైకమీషన్ తెలిపింది.

బీఎల్ఎస్ కేంద్రాలలో ఫిబ్రవరి 1 నుంచి ఈ సౌకర్యం అందుబాటులో వుంటుందని చెప్పింది.

"""/"/ వీసా, ఓసీఐ, పాస్‌పోర్ట్ ఇతర కాన్సులర్ సేవలను కోరుకునే దరఖాస్తుదారులందరూ తమ దరఖాస్తులు, సహాయక పత్రాలను సమర్పించడానికి వాక్ ఇన్ మోడ్‌ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని హైకమీషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ నిర్ణయంతో పెండింగ్‌లో వున్న దరఖాస్తుదారులకు ఊరట కలిగినట్లయ్యింది.డిసెంబర్‌లో భారత హైకమీషనర్ సంజయ్ కుమార్ వర్మ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డ్‌ల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను లేవనెత్తారు.

ఈ దరఖాస్తుల సంఖ్య గతేడాది నవంబర్ నాటికి 49,000కి పెరిగింది.గతేడాది ఇదే నెలలో వీటి సంఖ్య 26,000.

"""/"/ దరఖాస్తుల పెరుగుదలకు ప్రధాన కారణం కెనడాలో భారత సంతతి వలసదారుల జనాభా పెరగడమే.

వివిధ కెనడియన్ విద్యాసంస్థలలో 2,40,000 మంది విద్యార్ధులు చదువుకుంటున్నారు.2021లో ఈ సంఖ్య 1,27,933గా వుంది.

కోవిడ్ సంక్షోభం కారణంగా అంతరాయం కలిగిన సేవలను క్రమంగా సాధారణీకరించడంలో భాగంగా వాక్ ఇన్ దరఖాస్తులను అంగీకరిస్తున్నట్లు భారత హైకమీషన్ తెలిపింది.

అలాగే 2020 ప్రారంభంలో కోవిడ్ మొదలైనప్పుడు తాత్కాలికంగా నిలిపివేయబడిన పదేళ్ల మల్టీపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా స్కీమ్‌ను పునరుద్దరించడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ.

గతేడాది డిసెంబర్‌లో కెనడియన్ జాతీయుల కోసం ఈ - వీసా ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు.

తమ దరఖాస్తుల సమర్పణ కోసం ఇప్పటికే అపాయింట్‌మెంట్‌లను బుక్ చేసుకున్న వారు.వాక్ ఇన్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా హైకమీషన్ అభ్యర్ధించింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి20, సోమవారం2025