ఎన్టీఆర్ వచ్చాకే బీసీలకు ప్రాధాన్యత.. అచ్చెన్నాయుడు

దివంగత నేత ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాతనే బీసీలకు ప్రాధాన్యత ఏర్పడిందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎన్టీఆర్ 27 శాతం రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు.

ఆ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచిన ఘనత చంద్రబాబుదని పేర్కొన్నారు.సీఎం జగన్ కు విభజించడం, పాలించడం అలవాటు అయిందని విమర్శించారు.

54 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా నామమాత్రంగానే మిగిలాయన్నారు.కేంద్రంపై ఒత్తిడి తెచ్చి జన గణన జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా టీడీపీ మేనిఫెస్టో పై మహానాడులో చంద్రబాబు ప్రకటన చేస్తారని అచ్చెన్న తెలిపారు.

దశమి రోజున ముసాయిదా మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు.విస్తృతమైన చర్చ జరిగిన తరువాతే ఎన్నికల్లో తుది మేనిఫెస్టో ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.

టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తేనే బీసీలకు సాధికారతని వెల్లడించారు.

ఈ అరిచే మమ్మీ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలిస్తే షాకే..?