జ్ఞాపకశక్తి మెరుగుపడేందుకు ఇలా వ్యాయామం చేస్తే సరిపోతుందట!
TeluguStop.com
వృద్ధాప్యం అనేది మన శారీరక సామర్థ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, జ్ఞాపకశక్తి సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
దీనిని నివారించేందుకు వ్యాయామం చాలా వరకు సహాయపడుతుంది.వృద్ధులలో అల్జీమర్స్ వ్యాధి కనిపిస్తుంటుంది.
అది వారి మెరుగైన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.50, 60 ఏళ్ల వయస్సు వచ్చినవారు వారానికి మూడుసార్లు సైక్లింగ్, బ్రిస్క్ వాకింగ్, జాగింగ్ తదితర వ్యాయామాలు చేయడం వల్ల కండరాలు బలపడడమే కాకుండా మెదడు కణాలకు కూడా ఎంతో మేలు జరుగుతుందని తాజా పరిశోధనలో వెల్లడైంది.
పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలోని కెన్నెత్ పి.డైట్రిచ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌కు చెందిన డాక్టర్ సారా అఘజయన్ ఈ విషయమై మాట్లాడుతూ.
తాము ఏపాటి వ్యాయామం చేయాలి అని ప్రతి ఒక్కరూ ఎప్పుడూ అడుగుతారు.తమను తాము మెరుగు పరుచుకోవడానికి చేయవలసిన కనీస వ్యాయామం ఏమిటని కూడా అడుగుతారు.
కనీసం నాలుగు నెలల పాటు వారానికి మూడు సార్లు వ్యాయామం చేయడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని మా అధ్యయనంలో వెల్లడయ్యిందని తెలిపారు.
గతంలో జరిగిన సంఘటనలను మన మెదడుకు గుర్తుచేస్తుంది.అయితే వయస్సు పెరుగుతున్న కొద్దీ ఈ సామర్థ్యం తగ్గుతుంది.
గుండెకు రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యాన్ని పెంచే వ్యాయామాలు మెదడు పనితీరును పెంచడంలో కూడా ప్రభావవంతంగా ఉన్నాయని పరిశోధనల్లో తేలిందని తెలిపారు.
దీనిని తెలుసుకునేందుకు పరిశోధనా బృందం 3,000కు మించిన ప్రజలపై 36కు పైగా అధ్యయనాలను నిర్వహించింది.
"""/" /
దీనిలో 69 నుండి 85 సంవత్సరాల వయస్సు గల వారి కంటే 55 నుండి 68 సంవత్సరాల వయస్సు గలవారిలో జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని మేము కనుగొన్నామన్నారు.
అందుకే జ్ఞాపకశక్తి మరింత దిగజారకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం అని అన్నారు.
ఈ పరిశోధన ఫలితాలు 'కమ్యూనికేషన్స్ మెడిసిన్' జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి కోల్పోకుండా ఉండేందుకు వ్యాయామమే సులభమైన మార్గమని ఈ పరిశోధన కీలక విషయాన్ని వెల్లడించింది.
మీరు ఎక్కువగా అలసిపోనవసరం లేదని, బయటికి వెళ్లి కొద్ది పాటి వ్యాయామం చేస్తే సరిపోతుందని, ఇటువంటప్పుడు మంచి వాకింగ్ షూ అవసరమని డాక్టర్ సారా అఘజయన్ తెలిపారు.
ఇండియన్ సినీ ఇండస్ట్రీకి ఎన్టీఆర్ ఓ వరం.. దగ్గుబాటి వేంకటేశ్వరరావు కామెంట్స్ వైరల్!