పుష్ప ఓటీటీలో వచ్చిన తర్వాత కూడా ఓ అరుదైన రికార్డు నమోదు

అల్లు అర్జున్‌ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా సుకుమార్‌ దర్శకత్వం లో సమంత ఐటెం సాంగ్‌ చేయగా రూపొంది తెలుగు ప్రేక్షకుల ముందుకు మాత్రమే కాకుండా యావత్‌ దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది.

సుకుమార్‌ స్వయంగా ఈ సినిమా పాన్ ఇండియా సినిమా ఎలా అవుతుందని అనుకున్నాడట.

కాని బాలీవుడ్‌ లో ఈ సినిమా ఏకంగా 75 కోట్ల రూపాయలను రాబట్టింది.

మొదటి రోజు కేవలం 3 కోట్లు రాబట్టిన పుష్ప సినిమా బాలీవుడ్‌ లో ఏకంగా 75కోట్లు రాబట్టడం అంటే రికార్డు అనడంలో సందేహం లేదు.

విడుదల అయిన మూడు వారాల్లోనే ఈ సినిమా ను స్ట్రీమింగ్‌ చేసేందుకు గాను ప్రముఖ ఓటీటీ ప్రైమ్‌ వీడియో వారికి హక్కులు ఇవ్వడం జరిగింది.

"""/"/ అయినా కూడా ఈ సినిమా థియేటర్లలో నడుస్తుంది.ఇటీవల అమెజాన్ ప్రైమ్‌ లో సినిమా స్ట్రీమింగ్ మొదలు అయ్యింది.

అయినా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఇంకా థియేటర్లలో ఆడుతుంది.తద్వారా 75 లక్షల షేర్‌ వచ్చింది.

స్ట్రీమింగ్ అవుతున్నా కూడా అంత మొత్తం వసూళ్లు వచ్చాయి అంటే ఏ స్థాయి లో జనాల్లోకి సినిమా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.

పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యం లో నిర్మాతలకు భారీగా లాభాలు వచ్చాయి.

ఇక అన్ని ఏరియాల్లో ఈ సినిమా ను పంపిణి చేసిన బయ్యర్లకు కూడా లాభాలు దక్కాయి.

మొత్తంగా ఈ సినిమా బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ గా నిలిచింది అనడంలో సందేహం లేదు.

పుష్ప పార్ట్‌ 1 కు వచ్చిన రెస్పాన్స్ తో పార్ట్‌ 2 ను తెరకెక్కించేందుకు సుకుమార్‌ మరింత బాధ్యతా యుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

ఈ విషయంలో పుష్ప రాజ్ మేకర్స్ చాలా ఇంట్రెస్ట్‌ తో ఉన్నారు.ఈ ఏడాది డిసెంబర్ లోనే పుష్ప 2 విడుదల అయ్యే అవకాశం ఉంది.

ఒక్క లిప్ లాక్ సీన్ కోసం 37 టేకులు.. ఆ సీన్ గురించి హీరో రియాక్షన్ ఇదే!