కరోనా నుండి కోలుకున్నాక.. బయటపడిన మరో ప్రమాదం.. !

కోవిడ్ ఒక మనిషి ప్రాణాన్ని ఎన్ని విధాలుగా అయినా తీయవచ్చని నిరూపిస్తుంది.మనిషిలో ఉన్న రోగనిరోధక శక్తిని ధ్వంసం చేస్తూ ఒక్కో అవయం మీద తన ప్రతాపాన్ని చూపిస్తూ చిట్టచివరికి ప్రాణాలు పోవడానికి కారణం అవుతుంది.

ఇప్పటికే మెదటి వేవ్, రెండో వేవ్ అంటూ వచ్చి ప్రజల జీవితాలను నిప్పుల మీద పెట్టి మాడ్చేస్తుండగా, బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ అంటూ మరో దాడి మొదలైంది.

ఇక ఈ సమస్యలన్ని దాటుకుని కరోనా నుండి కోలుకున్నాక వచ్చే సమస్యలే మరింత ప్రాణాంతకమవుతున్నాయి.

తాజాగా పేగుల్లోనూ క్లాట్స్ వచ్చి అవి గ్యాంగ్రీన్లుగా మారి ప్రాణాలకు గండగా మారుతున్నాయి.

కాగా ముంబైలోని దాదాపు అన్ని ఆసుపత్రుల్లోనూ ఈ కేసులు ఎక్కువవుతున్నాయట.ఈ మధ్యే హోలీ స్పిరిట్ ఆసుపత్రిలో కూడా ఒక రోగికి ఈ సమస్య వచ్చిందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

ఇకపోతే కరోనాతో కోలుకున్నాక భరించలేని కడుపునొప్పి వస్తే మాత్రం నిర్లక్ష్యం చేయకండని వెల్లడిస్తున్నారు.

జపాన్ సముద్ర గర్భంలో 12,000 ఏళ్ల పిరమిడ్.. ఆ ‘మహా నగరం’ ఇదేనా?