Sukumar Lokesh Kanagaraj : రాజమౌళి తర్వాత ఆ స్థాయి క్రేజ్ ఉన్న డైరెక్టర్లు వీళ్లే.. వీళ్లకు మాత్రమే ఆ రికార్డులు సాధ్యమంటూ?
TeluguStop.com
టాలీవుడ్ దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి( Rajamouli ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్నారు.కాగా ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు సరికొత్త రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే.
అంతేకాకుండా బాహుబలి లాంటి సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పారు.ఆర్ఆర్ ఆర్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరి చూపులు తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు చూసేలా చేశారు రాజమౌళి.
ఈ ఒక్క మూవీతో ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులను సంపాదించుకున్నారు. """/" /
ఇది ఇలా ఉంటే తాజాగా జక్కన్నకు సంబందించిన ఒక వార్త చక్కర్లు కొడుతోంది.
అయితే మరి రాజమౌళి స్థానం తర్వాత సౌత్ నుంచి మరెవరిది? రాజమౌళిని టచ్ చేసే దర్శకులు ఎవరు ఎంతమంది ఉన్నారు? ఆయనను దాటి ముందుకెళ్లగలరా? ఇలా అనేక రకాల ప్రశ్నలు చాలామందికి తలెత్తే ఉంటాయి.
మరి ఈ విషయంలో ముగ్గురు పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.మొదటి పేరు సుకుమార్, రెండవ పేరు లోకేష్ కనగరాజ్, మూడవ పేరు ప్రశాంత్ నీల్.
ఆ తర్వాత మణిరత్నం, శంకర్.అయితే ఈ సీనియర్ దర్శకుల్ని పక్కనబెడితే నేటి తరం దర్శకులలో ఈ ముగ్గురు రాజమౌళిలా గ్రేట్ అనిపించుకోవాలని గట్టి ప్రయత్నం చేస్తున్నారట.
ఇంతకీ ఆ ముగ్గురు దర్శకులు ఎవరు అన్న విషయానికి వస్తే.మొదటగా అందులో సుకుమార్( Sukumar ) పేరు ఎక్కువగా వినిపిస్తోంది.
"""/" /
పాన్ ఇండియా రేంజ్ లో పుష్ప విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఈ మూవీతో అంతర్జాతీయంగా ఫేమస్ అయ్యారు లెక్కల మాస్టర్.ఆ తర్వాత కేజీఎఫ్ ప్రాంచైజీతో ప్రశాంత్ నీల్ కూడా భారీగా ఫేమస్ అయ్యాడు.
ఆ సినిమా రెండు భాగాలు పాన్ ఇండియాని షేక్ చేసి కోట్ల రూపాయల వసూళ్లు సాధించడంతో ప్రశాంత్ నీల్ పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగింది.
తదుపరి డైరెక్టర్ లోకేష్ కనగరాజ్( Lokesh Kanagaraj )విక్రమ్,ఖైదీ లాంటి రెండు విజయాలు లోకేష్ కి పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును తెచ్చి పెట్టాయి.
అతనితో పనిచేయడానికి అన్ని పరిశ్రమల హీరోలు క్యూ కడుతున్నారు.అయితే ఈ వరుసలో డైరెక్టర్ అట్లీని చేర్చడం సమజసం కాదన్న విమర్శలు ఉన్నాయి.
జవాన్ లాంటి సినిమా బాక్సాఫీస్ వద్ద 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించినా అదంతా కేవలం షారుక్ ఖాన్ ఇమేజ్ వల్ల సాధ్యమైంది తప్ప అట్లీ క్రియేటివీటీతో కాదని ఒక విమర్శ కూడా ఉంది.
కాబట్టి అట్లీని వాళ్ల సరసన చేర్చడం సరి కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గుడ్ న్యూస్ చెప్పిన దిల్ రాజు భార్య తేజస్విని.. ఏమైందంటే?