మారుతి సినిమా పూర్తి అయితే ప్రభాస్ చేయబోతున్నది అదే!
TeluguStop.com
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్( Prabhas ) బాహుబలి తర్వాత సాలిడ్ సక్సెస్ ను అందుకోలేదు.
ఇప్పటికే సాహో, రాధేశ్యామ్ మరియు ఆదిపురుష్ సినిమా లతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ త్వరలోనే సలార్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం లో రూపొందుతున్న ప్రాజెక్ట్ కే 'కల్కి' సినిమా( Kalki ) తో రాబోతున్నాడు.
ఆ తర్వాత ఒక ప్రయోగాత్మక మూవీ ని మారుతి దర్శకత్వం లో చేస్తున్నాడు.
"""/" / ఆ సినిమా తో వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఒక వైపు భారీ సినిమా లు చేస్తూనే మరో వైపు మారుతి తో( Director Maruthi ) ప్రస్తుతం చేస్తున్న అటువంటి చిన్న ప్రయోగాత్మక సినిమా లను ప్రభాస్ చేయాలని నిర్ణయించుకున్నారు.
అందుకే ఇప్పటికే ప్రభాస్ కొత్త సినిమా కు కమిట్ అయ్యాడు.యూత్ ఫుల్ లవ్ స్టోరీ సినిమా లను రూపొందించి సక్సెస్ లను దక్కించుకున్న దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వం లో ప్రభాస్ సినిమా కన్ఫర్మ్ అయింది.
అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే 2024 సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరి వరకు మారుతి దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా ను ముగించబోతున్నారు.
కనుక హను రాఘవపూడికి వచ్చే ఏడాది సమ్మర్ లో డేట్ల ను ఇవ్వడం జరిగిందని తెలుస్తోంది.
"""/" / ఈ లోపు ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి చేసి.
కేవలం నాలుగు నెలల్లోనే సినిమా ను గించాలని భావిస్తున్నారు.అన్ని అనుకున్నట్లుగా జరిగితే ప్రభాస్, హను రాఘవపూడి( Hanu Raghavapudi ) కాంబోలో రూపొందుతున్న సినిమా ను 2024 లోనే విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఒక వేళ 2024 లో మిస్ అయితే కచ్చితంగా 2025 సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
సీతరామం వంటి ఓ బ్లాక్ బస్టర్ ప్రభాస్ కి దక్కితే చూడాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.
మరి అది ఎంత వరకు వర్కౌట్ అయ్యేనో చూడాలి.
బిచ్చగాడి రోల్ గురించి ధనుష్ కు చెప్పడానికి అలా ఫీలయ్యా.. శేఖర్ కమ్ముల ఏమన్నారంటే?