ఫలించిన న్యాయపోరాటం .. శ్రీలంక శరణార్ధికి భారత్‌లో ఓటు హక్కు, కల నెరవేరిందంటూ భావోద్వేగం
TeluguStop.com
తాను భారత సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా ఓటు వేయబోతున్నానంటూ సంతోషం వ్యక్తం చేశారు ( Tamil Nadu ) తిరుచ్చి కొత్తపట్టు వద్ద శ్రీలంక తమిళుల పునరావాస శిబిరంలో నివసిస్తున్న నళిని కిరుబాకరన్ (38).
( Nalini Kirubakaran ) ఇప్పుడు నేను భారతీయురాలినని సగర్వంగా చెప్పుకుంటున్నాను.దశాబ్ధాలుగా ఈ అవకాశం ఎప్పుడొస్తుందా అని కలలు కంటున్నానని నళిని గుర్తుచేసుకున్నారు.
1986లో రామేశ్వరంలోని శరణార్థి కేంద్రమైన మండపం క్యాంపులో( Mandapam Camp ) నళిని జన్మించారు.
2021లో మద్రాస్ హైకోర్టును( Madras High Court ) ఆశ్రయించడంతో ఓటింగ్ హక్కుల కోసం పోరాటం ప్రారంభించారు.
భారతీయ పాస్‌పోర్ట్( Indian Passport ) కోసం దరఖాస్తు చేయగా.ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం తిరస్కరించింది.
ఆగస్ట్ 12, 2022న జస్టిస్ జీఆర్ స్వామినాథన్ నేతృత్వంలోని మద్రాస్ హైకోర్ట్ మధురై బెంచ్.
మండపం నుంచి నళిని జనన ధృవీకరణ పత్రాన్ని ఉటంకిస్తూ ఆమెకు భారతీయ పాస్‌పోర్ట్ జారీ చేయాలని అధికారులను ఆదేశించింది.
పౌరసత్వ చట్టం 1955లోని సెక్షన్ 3 ప్రకారం.భారతదేశంలో 26 జనవరి 1950 నుంచి జూలై 1, 1987 మధ్య జన్మించిన వ్యక్తి జన్మత: భారతీయుడేనని ధర్మాసనం పేర్కొంది.
"""/" /
న్యాయపోరాటం తర్వాత ఆమె తన పాస్‌పోర్టును పొందింది.కానీ తన కుటుంబంతో కలిసి వుండటానికి జిల్లా కలెక్టర్ నుంచి ప్రత్యేక అనుమతితో పునరావాస శిబిరంలో నివసిస్తోంది.
ఈ ఏడాది ప్రారంభంలో తన ఓటరు ఐడీని అందుకున్న నళిని .శిబిరంలోని ఇతర శరణార్థులందరూ అదే హక్కులను అనుభవించాలని ఆశిస్తున్నారు.
కొన్ని దశాబ్థాలుగా తమిళనాడులోని శిబిరాల్లో నివసిస్తున్న శ్రీలంక తమిళులకు ,( Sri Lankan Tamil ) భారతీయ సంతతికి చెందిన తమిళులకు భారత పౌరసత్వం హామీ ఇచ్చే పార్టీకి తాను ఓటు వేస్తానని నళిని వెల్లడించారు.
ప్రస్తుతం భారతదేశంలోనే జన్మించిన తన ఇద్దరు పిల్లలకు కూడా పౌరసత్వం సాధించేందుకు తాను న్యాయపోరాటం చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
"""/" /
కాగా.స్టెల్లా మేరీ (పేరు మార్చబడింది) అనే భారత సంతతికి చెందిన తమిళురాలు కూడా ఇదే విధంగా న్యాయ పోరాటం చేస్తోంది.
పార్లమెంట్‌లో తమ సమస్యల కోసం పోరాడాలని వారు తమిళనాడుకు చెందిన నాయకులను కోరారు.
తమిళనాడు వ్యాప్తంగా 58,457 మంది శరణార్దులు ఇలాంటి శిబిరాల్లోనే నివసిస్తున్నారని మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ ప్రొఫెసర్ ఆషిక్ బోనోఫర్ తెలిపారు.
శ్రీలంక తమిళులకు పౌరసత్వం ఇవ్వడానికి కొత్త ప్రభుత్వానికి రాజకీయం సంకల్పం అవసరమని ఆయన వ్యాఖ్యానించారు.
నానికి స్పెషల్ గిఫ్ట్ పంపిన చిరు… అవార్డుతో సమానం… చిరు సినిమా పై నాని కామెంట్స్!