నాని ‘దసరా’ తర్వాత వారి సరసన నిలిచేనా? యూనిట్ సభ్యుల అంచనాలు ఏంటి?

నాచురల్ స్టార్ నాని( Nani ) దసరా సినిమా( Dasara Movie ) తో ఈ నెల 30వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు రెడీ అయింది.

సాధ్యమైనంత ఎక్కువగా ఉత్తర భారతంలో ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నారు.పుష్ప సినిమా సూపర్ హిట్ అవడం ఆ సినిమా తరహాలోనే ఈ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతున్న కారణంగా ఉత్తర భారతంలో ఈ సినిమా కి మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

దసరా సినిమా తర్వాత నాని పాన్ ఇండియా స్టార్ హీరో గా నిలిచే అవకాశం ఉందని యూనిట్ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అంతే కాకుండా ప్రభాస్, అల్లు అర్జున్( Prabhas, Allu Arjun ) వంటి పాన్ ఇండియా స్టార్ హీరోల సరసన నాని చోటు దక్కించుకుంటాడు అని కూడా దసరా చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంగా ఉన్నారు.

"""/" / ఇక ముందు నాని నుండి వచ్చే ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా సినిమా అవుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా దసరా సినిమా ఉంటే కచ్చితంగా వారి సరసన నాని నిలిచే అవకాశం ఉంది.

మరి ఆ స్థాయిలో దసరా సినిమా ఉంటుందా లేదా అనేది తెలియాలంటే మార్చి 30 తారీకు వరకు వెయిట్ చేయాల్సిందే.

నాని కెరియర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సినిమా ఇదే.అంతే కాకుండా విభిన్నమైన గెటప్ మరియు పాత్రలో కనిపించిన సినిమా కూడా ఇదే.

ఇక కీర్తి సురేష్ విషయానికొస్తే ఆమె పాత్ర కూడా చాలా విభిన్నంగా ఉంటుందట.

అంతే కాకుండా ఆమె లుక్ అభిమానులను సర్ప్రైజ్ చేసింది.అందుకే ముందు ముందు ఈ తరహా పాత్రలు ఆమెకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ సినిమా హిట్ అయితే ఆమె కు కూడా పాన్ ఇండియా స్టార్‌డం దక్కే అవకాశం ఉంది.

మచ్చలతో చింతేలా.. పటిక తో ఈజీగా వదిలించుకోండిలా!