చంద్రబాబు అరెస్ట్.. జనాల్లోకి టీడీపీ !
TeluguStop.com
టిడిపి అధినేత చంద్రబాబు ను ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం( AP Skill Development Scam ) లో అరెస్టు చేయడం, ఆయనను రాజమండ్రి జైలుకు తరలించిన నేపథ్యంలో అసలు వాస్తవాలు ఏమిటనేది ప్రజలకు వివరించేందుకు తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది.
ఈ మేరకు జనాల్లోకి వెళ్లి వారికి ఈ విషయాన్ని చెప్పాలని నిర్ణయించుకుంది.చంద్రబాబుపై సిఐడి రిమాండ్ రిపోర్టు( Chandrababu Remand Report )లో పొందుపరిచిన అంశాలన్నీ అసత్యలేనని, సిఐడి చేసిన ఆరోపణలో నిజం లేదని నిరూపించాలని, దీనిని జనంలోకి తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంది.
"""/"/ ఈ మేరకు ప్రత్యేక బుక్ లెట్లతో వివరణాత్మకంగా అన్ని అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలుగుదేశం పార్టీ( TDP ) నిర్ణయించుకుంది.
ఏపీలో ఎన్నికల సమయం కూడా దగ్గరకు వస్తుండడం, ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో జనాల్లో తిరుగుతూ, చంద్రబాబు ను అరెస్ట్( Chandrababu Arrest ) చేసిన విధానాన్ని ప్రజలకు వివరిస్తూ పెద్ద ఎత్తున సానుభూతి సంపాదించాలని, తద్వారా వాటిని ఓట్ల రూపంలోకి మార్చుకోవాలి అనే ఆలోచనలో ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది.
చంద్రబాబు చుట్టూ కుట్ర జరుగుతోందని , ప్రస్తుతం ఆయన నమోదైన కేసుల గురించి ప్రజలకు వివరిస్తే వారి నుంచి మద్దతు లభిస్తుందని టిడిపి కీలక నిర్ణయం తీసుకుంది .
చంద్రబాబును అక్రమ అరెస్టులు చేస్తూ, కేసులు నమోదు చేస్తున్న తీరును ప్రజలకు వివరించగలిగితే మంచి ఫలితాలు వస్తాయని టిడిపి అంచనా వేస్తోంది.
"""/"/
అంతేకాకుండా గతంలో జగన్ అక్రమాస్తుల కేసు( YS Jagan Illegal Assets Case )లో జైలుపాలైనప్పుడు జగన్ తల్లి విజయమ్మ , సోదరి షర్మిల జనాల్లోకి వచ్చి జగన్ పై సానుభూతి పెరిగే విధంగా రాష్ట్ర పర్యటనలు చేశారని, అదే మాదిరిగా చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మ ణి( Nara Brahmani ) కూడా రంగంలోకి దింపి రాష్ట్ర వ్యాప్తంగా వారితో పర్యటనలు చేయిస్తే మంచి ఫలితాలు వస్తాయని అంచనా వేస్తోంది.
ఏది ఏమైనా చంద్రబాబు అరెస్ట్ తో టిడిపి పై జనాల్లో సానుభూతి పెంచుకునే విధంగా ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అర్థమవుతుంది.
అతనికి జాబ్ లేకపోయినా పెళ్లి చేసుకుంటాను.. అనన్య శర్మ షాకింగ్ కామెంట్స్ వైరల్!