మొత్తానికి ఆ విషయం లో ప్రూవ్ చేసుకున్న కొండబాబు…

ప్రస్తుతం టాలీవుడ్( Tollywood ) లో యంగ్ హీరోల హవా నడుస్తుంది.గత వారం శ్రీ విష్ణు సామజవరగమన( Sri Vishnu Samajavaragamana ) అనే సినిమా చేసి సక్సెస్ కొడితే ఈ వీక్ లో ఆనంద్ దేవరకొండ కూడా మంచి సక్సెస్ అందుకున్నాడు.

నిజానికి ఆనంద్ విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్, పుష్పక విమానం, హైవే వంటి చిత్రాల్లో నటించాడు.

ఇందులో మిడిల్ క్లాస్ మెలోడీస్ మంచి సక్సెస్ అందుకుంది.అయితే ఆ సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వడంతో ఆనంద్ కి థియేట్రికల్ సక్సెస్ మిస్ అయ్యిందని చెప్పాలి.

ఇదంతా పక్కన పెడితే.తన అన్న విజయ్ దేవరకొండలాగే ఆనంద్ దేవరకొండ( Anand Deverakonda ) కూడా ఎక్కువగా ట్రోలింగ్ ను ఫేస్ చేస్తూ వచ్చాడు అని చెప్పాలి.

"""/" / చిన్న కొండ, బుల్లి కొండ అంటూ ఆనంద్ ను అదే పనిగా ట్రోల్ చేసిన బ్యాచ్ చాలా మందే ఉన్నారు.

కానీ ‘బేబీ’ సక్సెస్ తో అతను హిట్ ట్రాక్ ఎక్కడమే కాకుండా ఆ ట్రోలింగ్ కి కొంత అడ్డుకట్ట వేసాడు అని చెప్పవచ్చు.

‘బేబీ’ ( Baby )సినిమా చూశాక.ఈ పాత్రకి అతనైతేనే కరెక్ట్ అనే భావన అందరికీ కలిగింది.

‘అర్జున్ రెడ్డి’ లాంటి పాత్ర బేబీ ద్వారా ఇతనికి కూడా దొరికినట్లయింది.ఆ పాత్రకి ఇతను న్యాయం చేశాడు.

ఈ సినిమా కోసం ఆనంద్ చాలా కష్టపడ్డాడు. """/" / వేరే సినిమా ఆఫర్స్ వచ్చినా పారితోషికానికి కనెక్ట్ అవ్వకుండా దాదాపు రెండేళ్లు ‘బేబీ’ కథ పై వర్క్ చేశాడు.

బాక్సాఫీస్ వద్ద కూడా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతుంది.

మొత్తానికి అయితే ఆనంద్ మంచి నటుడు అని ఈ సినిమా తో ప్రూవ్ చేసుకున్నాడు.

ఇక మీదట ఆనంద్ దేవరకొండ కూడా ఈ సక్సెస్ ని కంటిన్యూ చేస్తూ సినిమాలు చేస్తాడో లేక మళ్ళీ స్టోరీ సెలక్షన్స్ లో మిస్టేక్స్ చేస్తూ మళ్ళీ ప్లాప్ లా బాట పడతాడో చూడాలి.

గ్రహశకలాన్ని గుర్తించి అరుదైన ఘనత సాధించిన విద్యార్థి